Share News

Polavaram Dam : నేడు పోలవరం ప్రగతిపై కేంద్ర జలశక్తి సమీక్ష

ABN , Publish Date - Feb 10 , 2025 | 05:27 AM

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీ అధ్యక్షతన సోమవారం న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించనున్నారు.

Polavaram Dam  : నేడు పోలవరం ప్రగతిపై కేంద్ర జలశక్తి సమీక్ష

అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రధాన డ్యామ్‌ పనుల ప్రగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబర్షి ముఖర్జీ అధ్యక్షతన సోమవారం న్యూఢిల్లీలో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధాన డ్యామ్‌ పనుల్లో కీలకమైన సమాంతర డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణం కోసం అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్‌ ఇచ్చిన సూచనల మేరకు ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ టీ-16 మిశ్రమాన్ని కాంట్రాక్టు సంస్థ బావర్‌ వాడుతోంది. డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణాన్ని ఈ ఏడాది ఆఖరుకు పూర్తిచేయాలని కేంద్ర జలశక్తి లక్ష్యాన్ని నిర్దేశించింది. డయాఫ్రమ్‌వాల్‌ 600 మీటర్లకు చేరే సరికి ఒకవైపు నుంచి ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు ప్రారంభించాలని నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్‌ను కేంద్ర జలశక్తి సూచించింది. ఈ పనులు 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని చెబుతోంది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 05:27 AM