Share News

Secretariat Reform : మరింత చేరువగా సచివాలయాలు

ABN , Publish Date - Jan 27 , 2025 | 03:29 AM

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను ప్రభుత్వ బహుళ అవసరాలు, సాంకేతికత, ఆకాంక్ష(ఆస్పిరేషన్‌)లకు అనుగుణంగా విభజించనున్నారు.

Secretariat Reform : మరింత చేరువగా సచివాలయాలు

  • జనాభా పరంగా ఏ, బీ, సీలుగా వర్గీకరణ

  • వైజ్ఞానిక సమాజ సృష్టి కేంద్రాలుగా మార్పు

  • ప్రభుత్వ బహుళ అవసరాలు, సాంకేతికత,

  • ఆకాంక్ష విభాగాలుగా సిబ్బంది నియామకం

  • గిరిజన ప్రాంతాలకూ అనుసంధానం

అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాలను హేతుబద్ధీకరిస్తూ సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులను ప్రభుత్వ బహుళ అవసరాలు, సాంకేతికత, ఆకాంక్ష(ఆస్పిరేషన్‌)లకు అనుగుణంగా విభజించనున్నారు. అదేవిధంగా 3,500 పైబడి జనాభా ఉన్న సచివాలయాలను ‘విభాగం-ఏ’గా, 2,501-3,500 జనాభా కలిగిన సచివాలయాలను ‘విభాగం-బీ’గా, 2,500 జనాభాలోపు ఉన్న సచివాలయాలను ‘విభాగం-సీ’గా వర్గీకరించారు. ‘విభాగం-ఏ’ కింద ఉన్న సచివాలయాల్లో కనీసం ఆరుగురు సిబ్బందిని, ‘విభాగం-బీ’ సచివాలయాల్లో కనీసం ఏడుగురు, ‘విభాగం-సీ’ సచివాలయాల్లో కనీసం 8మంది సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఆయా సచివాలయాల పరిధిలోని జనాభా సంఖ్యనుబట్టి సిబ్బందిని పెంచుతారు. ఆస్పిరేషనల్‌ సిబ్బందిని నియమిస్తారు. వీరికి ఏఐ, ఐఓటీ, డ్రోన్స్‌ తదితర సాంకేతికతలపై శిక్షణ ఇస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సరిపోను మిగిలిన సిబ్బందిని ఆయా శాఖలకు సంబంధించిన ఇతర విభాగాలకు కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో ఏవైనా నివాసిత ప్రాంతాలు 10కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువగా ఉంటే అలాంటి ప్రాంతాలను పంచాయతీ, రెవెన్యూ గ్రామాల నుంచి విడదీయకుండా దగ్గరగా ఉన్న సచివాలయాలకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు.


అదనపు సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో నియమిస్తారు. పంచాయతీ కార్యదర్శి/వార్డ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కార్యదర్శులను గ్రామ/వార్డ్‌ హెడ్‌గా పిలుస్తారు. మూడంచెల గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు జిల్లా, మండల స్థాయిలో వేర్వేరుగా కార్యాలయాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణకు సిబ్బందిని నియమిస్తారు. సచివాలయాలను వైజ్ఞానిక సమాజాల సృష్టి కేంద్రాలుగా మార్చాలని, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్‌ అక్షరాస్యత, కృత్రిమ మేథ, ఎంఎస్ఎంఈలకు సౌకర్యాలు కల్పించడం, ఆహారతయారీ, ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటారని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!

Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..

Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల

Updated Date - Jan 27 , 2025 | 03:29 AM