AP Police vs YS Jagan: అది మరిచిపోతే ఎలా.. జగన్‌కు ఇచ్చిపడేసిన ఏపీ పోలీసులు..
ABN , Publish Date - Feb 18 , 2025 | 08:48 PM
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌పై ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బ తినేలా జగన్ వ్యాఖ్యలు చేయడంపై..
అమరావతి, ఫిబ్రవరి 18: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌పై ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బ తినేలా జగన్ వ్యాఖ్యలు చేయడంపై పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ మనోభావాలు, ఆత్మ స్థైర్యం దెబ్బ తినేలా జగన్ గారి వ్యాఖ్యలు ఉన్నాయని.. ఆయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు పోలీసులు ఉన్నతాధికారులు. పోలీసులను ఉద్దేశించి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయాయని అనడం సరికాదన్నారు. పోలీస్ అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి బట్టలు ఊడదీసి నిలబెడతానని అనడం సమంజసమా.. అని జగన్‌ను ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అని జగన్ తీరును తూర్పారబట్టారు.
రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు గత ఎనిమిది నెలల కిందట తమరి ప్రభుత్వంలో పని చేసిన వారే అన్న విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ మర్చిపోయినట్లున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పోలీసులు.. రాజకీయాలకు, వర్గాలకు, రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ.. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారి పోయిందని వ్యాఖ్యానించడం అత్యంత దురదృష్టకరం అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు ఎప్పుడూ చట్టానికి, ధర్మానికి, న్యాయానికి, సత్యానికి సంకేతాలైన ఆ నాలుగు సింహాలకే సెల్యూట్ చేస్తారని ఉద్ఘాటించారు. అంతే తప్ప చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వారికి చేయరని జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలుసుకోవాలని హితవు చెప్పారు. రిటైర్డ్ అయిన తరువాత కూడా తీసుకుని వచ్చి బట్టలూడదీస్తామన్న జగన్ బెదిరింపు వ్యాఖ్యలు.. ప్రజాస్వామ్యంపై, చట్టాలపై ఆయనకు ఏమాత్రం గౌరవం లేదన్న విషయం వెల్లడవుతుందన్నారు. జగన్ ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించి.. పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా అవమానకర బెదిరింపు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని పోలీసు అధికారుల సంఘం హితవు చెప్పింది.
Also Read:
నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి
మొసలికి చుక్కలు చూపించిన ఏనుగు..
2 విడతల్లో డీఏ..? భారీ పెరగనున్న పెన్షన్లు, జీతాలు..!
For More Andhra Pradesh News and Telugu News..