PM Modi: నేడు ప్రధాని మోదీ పుట్టపర్తికి రాక
ABN , Publish Date - Nov 19 , 2025 | 07:12 AM
సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తికి బుధవారం వస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రధాని ఉదయం 9.30 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటారు.
- హిల్ వ్యూ స్టేడియంలో వేడుకలు
- సత్యసాయి సన్నిధిలో సచిన్, ఐశ్వర్య రాయ్
- పుట్టపర్తికి చేరుకున్న సీఎం, డిప్యూటీ సీఎం, లోకేశ్
పుట్టపర్తి: సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పుట్టపర్తికి బుధవారం వస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రధాని ఉదయం 9.30 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఆయనకు స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 12.25 గంటల వరకూ వేడుకలలో పాల్గొంటారు. అనంతరం కోయంబత్తూరుకు వెళతారు. ప్రధాని పర్యటనకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పుట్టపర్తికి వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
- సత్యసాయి స్మారకంగా రూ.100 నాణేన్ని, నాలుగు తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరిస్తారు. వంద మంది రైతులకు పాడి ఆవులను పంపిణీ చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదేళ్లలోపు బాలికలకు ఆర్థిక భరోసానిచ్చే బృహత్తర పథకాన్ని ప్రారంభిస్తారు. విద్య, వైద్య, సామాజిక రంగాల్లో సేకు సంబంధించిన మరో ప్రధానమైన పథకాన్ని ప్రధాని చేత సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆవిష్కరించే అవకాశం ఉంది.
- హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించే వేడుకలలో సుమారు 500 మంది వీవీఐపీలు పాల్గొంటారు. సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యా రాయ్, మాజీ సీజేఐ జస్టిన్ ఎన్వీ రమణ తదితరులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు.

- భద్రత కట్టుదిట్టం
శత జయంతి ఉత్సవాలకు బుధవారం లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో అధికారులు, పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాని పర్యటన ముగిసేదాకా పుట్టపర్తికి వచ్చే వాహానాలను బ్రహ్మణపల్లి, ఎనుములపల్లి, పడమర గేట్ మీదుగా మళ్లించారు. అనంతరం యథావిధిగా రాకపోకలు సాగించవచ్చు. కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్, ఎస్పీ సతీశ్ కుమార్, ట్రస్టు ప్రతినిధులు చక్రవర్తి, నాగానందం, ప్రసాద్, డాక్టర్ మోహన్, సేవాసంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్ పాండే, కో ఆర్డీనేటర్ కోటేశ్వరరావు, ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షుడు చలం, తెలంగాణ అధ్యక్షుడు వెంకట్రావు, ఏపీ అధ్యక్షుడు లక్ష్మణరావు సహా పలువురు సేవాదళ్ ప్రతినిధులు వేడుకలను పర్యవేక్షిస్తున్నారు.
- ఘన స్వాగతం
సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ మంగళవారం సాయంత్రం పుట్టపర్తికి చేరుకున్నారు. విమానాశ్రయంలో వారికి రెవెన్యూ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ బీకే పార్థసారథి, ఛీప్ సెక్రటరీ విజయానంద్, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యేలు పల్లె సింధూరా రెడ్డి, ఎంఎస్ రాజు, కందికుంట వెంకటప్రసాద్, బండారు శ్రావణి, దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, ఆర్టీసీ జోనల్ చైర్మెన్ పూల నాగరాజు, మాజీ మంత్రి పల్లెరఘునాథ రెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, టీడీపీ జిల్లా అధ్యక్షులు కొల్లకుంట్ల అంజనప్ప, వెంకటశివుడు యాదవ్ తదితరులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి షాదీ మహాల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక టెంట్ హౌస్‌లో బసచేశారు. మంత్రి లోకేశ్ కప్పలబండ పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేసిన టెంట్ హౌస్‌లో బసచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
సినిమాలకు.. ఇక సెలవు! నటనకు వీడ్కోలు.. పలికిన నటి తులసి
Read Latest Telangana News and National News