Share News

PM Modi Puttaparthi visit: పుట్టపర్తిలో ప్రధాని.. సత్యసాయి స్మారక నాణెం, స్టాంపుల విడుదల

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:36 PM

ప్రధాని నరేంద్ర మోదీ ప్రశాంత నిలయానికి చేరుకుని సాయి కుల్వంత్ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తదితరులు హాజరయ్యారు.

PM Modi Puttaparthi visit: పుట్టపర్తిలో ప్రధాని..  సత్యసాయి స్మారక నాణెం, స్టాంపుల విడుదల
Puttaparthi event PM Modi

పుట్టపర్తిలోని ప్రశాంత నిలయంలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశాంత నిలయానికి చేరుకుని సాయి కుల్వంత్ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తదితరులు హాజరయ్యారు (Sathya Sai Baba Jayanti Utsavam).


ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సత్య సాయి బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ఆవిష్కరించారు. అనంతరం సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అంతకుముందు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు సత్య సాయితో తమ అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. మానవ సేవే మాధవ సేవ అని సత్యసాయి విశ్వసించారని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసించారు (commemorative coin Sai Baba).

modi.jpg


ఈ కార్యక్రమం తర్వాత ప్రధాని మోదీ తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళతారు (Puttaparthi event PM Modi). అక్కడ ఆయన దక్షిణ భారత సహజ వ్యవసాయ శిఖరాగ్ర సమావేశం-2025ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో, దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 18,000 కోట్లకు పైగా విలువైన పీఎం-కిసాన్ 21వ విడతను ప్రధానమంత్రి విడుదల చేస్తారు. అనంతరం ఆ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తారు.


ఇవి కూడా చదవండి:

ట్రంప్ కటాక్షం కోసం లాబీయింగ్.. పాక్ ఎంత ఖర్చు పెట్టిందో తెలిస్తే..

చైనాలో నేపాల్ కరెన్సీ నోట్ల ప్రింటింగ్.. 17 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 19 , 2025 | 12:44 PM