తెలుగు ప్రజలు సంతోషంగా ఉండాలి: డిప్యూటీ సీఎం పవన్
ABN , Publish Date - Jan 14 , 2025 | 03:33 AM
‘రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటల సమ్మేళనమే సరదాల సంక్రాంతి పండగ.

అమరావతి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ‘రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటల సమ్మేళనమే సరదాల సంక్రాంతి పండగ. ఈ సందర్భంగా భారతీయులందరికీ, ముఖ్యం తెలుగువారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పండుగ కోసం నగరాలన్నీ పల్లెలవైపు పరుగులు తీశాయి. ప్రజలకు ఈ పండుగపై ఉన్న మక్కువను ఇది తెలియజేస్తుంది. పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం. ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా శోభిల్లాలి. తెలుగువారు ఎక్కడున్న ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’నని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.