Nara Lokesh: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: నారా లోకేశ్
ABN , Publish Date - Sep 26 , 2025 | 02:48 PM
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని, నాలుగు రోజులుగా వైద్యం చేయించుకుంటున్నారని జనసేన పార్టీ ఇచ్చిన సందేశానికి, ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
'మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కల్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఆయన త్వరగా తేరుకుని, మంచి ఆరోగ్యాన్ని పొందాలని, ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చేసిన సేవతో మనకు స్ఫూర్తినిస్తూ ఉండాలని.. అంతేకాక #OG సినిమా అద్భుతమైన విజయాన్ని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులతో జరుపుకోవాలని కోరుకుంటున్నా' అని నారా లోకేశ్ ఆకాంక్షించారు.
ఇక, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి జ్వరం తీవ్రత తగ్గలేదని, దగ్గు ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిపడుతున్నారని జనసేన పార్టీ ఎక్స్ లో తెలిపింది. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారని వెల్లడించింది. ఇందుకోసం పవన్ కల్యాణ్ మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్తారని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం
Read latest AP News And Telugu News