AP GST Amendment Bill: జీఎస్టీలో విప్లవాత్మక మార్పు.. ప్రజలకు ఎంతో మేలు: మంత్రి పయ్యావుల
ABN , Publish Date - Sep 26 , 2025 | 01:50 PM
ప్రజలకు పన్నుల రూపంలో వసూలు చేసేటప్పుడు గతంలో 4 టాక్స్ స్లాబ్‌లు ఉండేవని.. దీని వల్ల కన్ఫ్యూజన్ ఉండేదని మంత్రి పయ్యావుల తెలిపారు. దీంతో దేశ వ్యప్తంగా జీఎస్టీపై పెనుమార్పులు తీసుకురావాలని సూచించినట్లు చెప్పారు.
అమరావతి, సెప్టెంబర్ 26: ఏపీ జీఎస్టీ సవరణ బిల్లు 2025ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) సభ ముందుకు తీసుకువచ్చారు. చర్చ అనంతరం ఈ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావులు సభలో మాట్లాడుతూ.. ఈ బిల్లుపై సీఎం చాలా సుదీర్ఘంగా వివరించారని.. జీఎస్టీ మీద దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ప్రజలకు పన్నుల రూపంలో వసూలు చేసేటప్పుడు గతంలో 4 టాక్స్ స్లాబ్‌లు ఉండేవని.. దీని వల్ల కన్ఫ్యూజన్ ఉండేదని తెలిపారు. దీంతో దేశ వ్యాప్తంగా జీఎస్టీపై పెనుమార్పులు తీసుకురావాలని సూచించినట్లు చెప్పారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 6 నుంచి 8 నెలలు కసరత్తు చేసి వేల సంఖ్యలో ఉన్న వస్తువులను రెండు స్లాబ్‌లకు తీసుకురావడం జరిగిందని.. దీని వెనుక కేంద్రం ఎంతో కసరత్తు చేసిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒక మాట అంటే దాని వెనుక యాక్టివిటీ అంతా పూర్తి అయిపోయి ఉంటుందన్నారు. ఒక సర్జికల్ స్ట్రయిక్‌తో అంతర్జాతీయంగా ఉలిక్కి పడేలా చేశారని మంత్రి అన్నారు. జీఎస్టీలో ఈ విప్లవాత్మక మార్పు ప్రపంచంలో ఎక్కడా జరగలేదని పేర్కొన్నారు. ఈ మార్పు వల్ల రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్లకు పైగ ప్రజలకు మేలు కలగనుందని తెలిపారు.
ఈనెల 22 నుంచి యాక్టివిటీ స్టార్ట్ చేశామని... పండుగ తరువాత ప్రతి ఇంటికి జీఎస్టీ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల కోసం సంబంధిత మంత్రిగా తాను, హెచ్‌ఆర్డీ మంత్రి లోకేష్ ఉన్నారన్నారు. వేల కొద్ది మీటింగ్‌లు నిర్వహించడానికి అనేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ మార్పు వల్ల వ్యాపారం సరలీకృతం అవుతుందని... దాని కోసం ఈ మార్పును తీసుకువచ్చామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అనంతరం ఏపీ జీఎస్టీ సవరణ బిల్లు 2025కు సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం
Read latest AP News And Telugu News