Share News

Deva dhyaya Commissioner : కొలిక్కివచ్చిన ‘దేవదాయ’ పంచాయితీ

ABN , Publish Date - Jan 25 , 2025 | 04:17 AM

కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణను ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఆ శాఖ చరిత్రలో తొలిసారి నాన్‌-ఐఏఎస్‌ అధికారి కె.రామచంద్రమోహన్‌ను కమిషనర్‌గా...

Deva dhyaya Commissioner : కొలిక్కివచ్చిన ‘దేవదాయ’ పంచాయితీ

  • కమిషనర్‌గా రామచంద్రమోహన్‌ బాధ్యతలు

  • కొత్త కార్యదర్శి వినయ్‌చంద్‌తో కలిసి మంత్రితో భేటీ

అమరావతి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ కమిషనర్‌ పంచాయితీ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణను ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఆ శాఖ చరిత్రలో తొలిసారి నాన్‌-ఐఏఎస్‌ అధికారి కె.రామచంద్రమోహన్‌ను కమిషనర్‌గా నియమించింది. దీనిపై కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలైంది. దేవదాయ కమిషనర్‌గానే కొనసాగేందుకు సత్యనారాయణ సైతం ప్రయత్నాలు చేశారు. ఆయన్నే ఉంచాలని కొందరు ఆధ్యాత్మికవేత్తలూ ప్రభుత్వానికి లేఖలు రాశారు. అయితే సర్కారు మాత్రం రామచంద్రమోహన్‌వైపే మొగ్గు చూపింది. ఉత్తర్వులు అమలు కావలసిందేనని సీఎంవో నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో సత్యనారాయణ శుక్రవారం మధ్యాహ్నం రిలీవయ్యారు. అటు హైకోర్టులో ఈ వ్యవహారం విచారణకు రాగా.. సర్వీసు వ్యవహారాలు చూసే ధర్మాసనానికి పిటిషన్‌ బదిలీ అయింది. దరిమిలా రామచంద్రమోహన్‌కు మార్గం సుగమమైంది. సాయంత్రం ఐదు గంటలకు ఆయన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇంకోవైపు.. దేవదాయ శాఖ కొత్త కార్యదర్శిగా వి.వినయ్‌చంద్‌ శుక్రవారమే సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం రామచంద్రమోహన్‌తో పాటు దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వినయ్‌చంద్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయాల అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పన, ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై చర్చించారు.


రామచంద్రమోహన్‌ బాధ్యతలు చేపట్టకుండా హైకోర్టులో రిట్‌

దేవదాయ శాఖ అదనపు కమిషనర్‌ రామచంద్రమోహన్‌ అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ పూర్తయ్యేవరకు ఆయన్ను ఆ శాఖలో కొనసాగించవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మచిలీపట్నానికి చెందిన వీవీ రమణమూర్తి హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కమిషనర్‌గా ఆయనకు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్‌ జారీచేసిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయాలని కోరారు. ఈ వ్యాజ్యం శుక్రవారం సింగిల్‌ జడ్జి ముందు విచారణకు రాగా.. ఉద్యోగుల సర్వీసు అంశాలపై విచారణ జరిపే ధర్మాసనానికి బదిలీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP News: ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి: సీఎంచంద్రబాబు..

Visakha: కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు శ్రీను.. మరి జగన్ వెళ్లారా..

Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 25 , 2025 | 04:23 AM