Share News

Aghori: ఉమ్మాడి నెల్లూరు జాతీయ రహదారి సమీపంలో అఘోరి హల్ చల్

ABN , Publish Date - Mar 02 , 2025 | 07:19 AM

ఉమ్మాడి నెల్లూరు జిల్లా: ఓజిలి మండలం, చుట్టూగుంట జాతీయ రహదారి సమీపంలో అఘోరి హల్ చల్ చేసింది. రెండు లారీలలో ఎద్దులను తీసుకు వెళుతున్న రైతులను ఆపి కత్తులు, సూలాలతో భయబ్రాంతులకు గురి చేసింది.

Aghori: ఉమ్మాడి నెల్లూరు జాతీయ రహదారి సమీపంలో అఘోరి హల్ చల్
Aghori Hall Chal

ఉమ్మడి నెల్లూరు జిల్లా: ఓజిలి మండలం, చుట్టుగుంట జాతీయ రహదారి (National Highway) సమీపంలో అఘోరి (Aghori ) హల్ చల్ (Hull Chal) చేసింది. మదనపల్లి నుండి పిఠాపురంకు రెండు లారీలలో ఎద్దులను తీసుకు వెళుతున్న రైతులను (Farmers) ఆపి కత్తులు, సూలాలతో భయబ్రాంతులకు గురి చేసింది. తాము రైతులమని ప్రాధయపడ్డారు. అయినా వారిపై దుర్భాషలాడుతూ బీభత్సం సృష్టించింది. పిఠాపురంకు వెళ్లే లోపు లారీలను తగలబెడతానంటూ అఘోరి వారికి హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఈ వార్త కూడా చదవండి..

వైసీపీతో వినాశనం


కాగా ఫిబ్రవరి 3న రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, జిల్లేల చెక్ పోస్ట్ దగ్గర అఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. వేములవాడలోని శ్రీ రాజ రాజేశ్వరి దేవస్థానంలో ఉన్న దర్గాను కూల్చి వేస్తానంటూ ఛాలెంజ్ చేసిన అగోరి ఆ దర్గాను కూల్చి వేయడానికి బయలుదేరింది. దీంతో తంగళ్ళపల్లి మండలం, జిల్లేల గ్రామ శివారులోని జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకొని తిరిగి వెనక్కి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రోడ్డుపై అఘోరి హల్ చల్ చేయడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అఘోరిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో.. పరిస్థితులు ఉద్రిక్తతగా మారాయి. పోలీసులు అఘోరితో మాట్లాడడానికి ప్రయత్నించినా.. ఒప్పుకోక పోవడంతో చివరికి చేసేదేమీ లేక టోయింగ్ వ్యాన్‌తో అఘోరి కారును హైదరాబాద్ మార్గంలో తరలించారు.


అలాగే నెల రోజుల క్రితం వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని శ్రీ కొమ్మాల లక్షీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు అఘోరీ వచ్చింది. దీంతో ఆమెను చూడడానికి స్థానికులు వచ్చారు. ఈ క్రమంలో వారందరినీ చూసి అఘోరి అసహనం వ్యక్తం చేసింది. అందులో ఓ వృద్ధుడు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అఘోరీ అంటూ అందరినీ మోసం చేస్తున్నావంటూ స్థానికులు అన్నారు. మహాకుంభ మేళాకు వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. దీంతో కోపానికి గురైన అఘోరీ కారు అద్దాలు పగులకొట్టడానికి వెళ్లింది. దాన్ని ఆపేందుకు వెళ్లిన వృద్ధుడిపైకి దూసుకువచ్చింది. స్థానికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో ఆగిపోయింది. తానూ మనిషినేనని, తనను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించింది.తర్వాత ఆమె దగ్గరికి వచ్చిన కొందరితో మాట్లాడి.. అక్కడి నుంచి కారులో వెళ్లిపోయింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కొలువుల పత్రాలు లేకున్నా జీతాలు!

సర్‌.. ‘ఫోన్‌ పే’ ప్లీజ్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 02 , 2025 | 07:19 AM