Share News

CPI Criticism: మోదీ పాలనలో దేశం అధోగతి

ABN , Publish Date - Aug 04 , 2025 | 05:08 AM

ఎన్నికల కమిషన్‌ను ప్రధాని మోదీ తన గుప్పెట్లో పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, దేశాన్ని అధోగతిపాలు

CPI Criticism: మోదీ పాలనలో దేశం అధోగతి

  • ఈసీని గుప్పెట్లో పెట్టుకుని ఇష్టారాజ్యం: సీపీఐ నారాయణ

సూళ్లూరుపేట, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కమిషన్‌ను ప్రధాని మోదీ తన గుప్పెట్లో పెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, దేశాన్ని అధోగతిపాలు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. సీపీఐ తిరుపతి జిల్లా మహాసభలు ఆదివారం సూళ్లూరుపేటలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో నారాయణ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పాలన చేస్తున్నారని ఆరోపించారు. అదానీ వంటి కార్పొరేట్‌ శక్తులకు దేశాన్ని ధారాదత్తం చేసి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారన్నారు. ‘దేశంలో ప్రతిపక్షాలను లెక్కచేయరు గానీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు భయపడతారు. ఆయనకు మోదీ బానిసగా మారిపోయారు. దేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టి విడదీసేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. మోదీ హయాంలో దేశంలో మత కలహాలు, ఘర్షణలు కనిపిస్తున్నాయి. రైతులను కూడా ఆదుకోలేని పరిస్థితులు ఉన్నాయి’ అని ఆందోళన వ్యక్తంచేశారు. మోదీ పాలనపై పోరాడేందుకు అన్ని పార్టీలు, ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్

తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 05:08 AM