Minister Subhash: కూటమి సంక్షేమంతో వైసీపీకి కునుకు కరువు
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:54 AM
ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం వైసీపీ నేతలకు కంటిపై కునుకు లేకుండా
అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం వైసీపీ నేతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాశ్ వ్యాఖ్యానించారు. బుధవారం అమరావతి సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘తల్లికి వందనం పథకాన్ని వైసీపీ నేతలు అపహాస్యం చేస్తున్నారు. అధికారులను వైసీపీ బెదిరిస్తోంది. రెడ్ బుక్ మడిచి ఎక్కడో పెట్టుకోమన్నారు. ఇప్పుడు అదే రెడ్ బుక్ పేరు చెప్తే వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదు. కొడాలి నాని, పేర్ని నాని నోటికొచ్చినట్లు మాట్లాడారు. లిక్కర్ స్కాంలో ఎవరెంత తీసుకున్నారో తేలాలి. అరెస్టులు ఎలా చేస్తారని జగన్ అంటున్నారు. తన పాలనలో ప్రశ్నిస్తేనే అరెస్టులు ఎలా చేశారో చెప్పాలి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి మా పార్టీ ఎమ్మెల్యేలు తలెత్తుకుని గ్రామాలకు వెళ్తున్నారు’ అని మంత్రి సుభాశ్ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒక పార్టీని టార్గెట్ చేస్తారా.. ఎంపీపై సుప్రీం అసహనం, రూ.10 లక్షల జరిమానా
ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
For AndhraPradesh News And Telugu News