తల్లి, చెల్లిని మోసం చేసిన జగన్ : మంత్రి సంధ్యారాణి
ABN , Publish Date - Jul 07 , 2025 | 04:12 AM
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఒక సైకో. ఆయన పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది. అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
పార్వతీపురం, జూలై 6(ఆంధ్రజ్యోతి): ‘‘వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఒక సైకో. ఆయన పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయింది.’’ అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు ద్వారా ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘మాజీ సీఎం జగన్.. తల్లి, చెల్లిని మోసం చేశారు. బాబాయిని హత్య చేయించారు. చెల్లి క్యారెక్టర్‌పై సొంత పత్రికలో అసభ్యకరంగా రాయించిన జగన్ ఒక పెద్ద దొంగ. సీఎం చంద్రబాబు ప్రజలను బాగు చేస్తారు. జగన్.. ప్రజలను చంపేస్తారు. వైసీపీ కార్యకర్త ఆయన కారు కింద పడిపోయి చనిపోతే కనీసం పట్టించుకోలేదు. క్యాన్సర్‌తో బాధపడుతున్న టీడీపీ కార్యకర్తకు సీఎం చంద్రబాబు ఫోన్ చేసి ఆరోగ్య విషయాలను తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీనీ అమలు చేస్తున్నారు. ఇది సైకో జగన్‌తో పాటు ఆ పార్టీ నాయకులకు కనిపించడం లేదా?’’ అని అన్నారు.