Share News

Amaravati : దుబాయిలో లోకేశ్‌.. జై షాతో భేటీ

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:42 AM

ఏపీలో క్రికెట్‌ క్రీడాభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ జై షాతో చర్చించినట్లు మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Amaravati : దుబాయిలో లోకేశ్‌.. జై షాతో భేటీ

  • తనయుడితో కలిసి క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షించిన మంత్రి

అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ఏపీలో క్రికెట్‌ క్రీడాభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ జై షాతో చర్చించినట్లు మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి లోకేశ్‌ ఆదివారం దుబాయి ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరుగుతున్న ఇండియా, పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ జై షాతో లోకేశ్‌ కొద్దిసేపు భేటీ అయ్యారు. ఏపీలో క్రికెట్‌ క్రీడాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు లోకేశ్‌ పేర్కొన్నారు.

Updated Date - Feb 24 , 2025 | 04:43 AM