Share News

Minister Kondapalli Srinivas: మెడికల్ కళాశాలల నిర్మాణంపై దుష్ప్రచారం చేస్తున్నారు

ABN , Publish Date - Sep 17 , 2025 | 09:08 PM

మెడికల్ కళాశాలల నిర్మాణంపై జగన్ దుష్ర్పచారం చేస్తున్నారని ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కళాశాల నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ.975 కోట్లు మాత్రమే జగన్ వినియోగించారని.. రాష్ట్రం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు.

Minister Kondapalli Srinivas: మెడికల్ కళాశాలల నిర్మాణంపై దుష్ప్రచారం చేస్తున్నారు

అమరావతి: మెడికల్ కళాశాలల నిర్మాణంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దుష్ర్పచారం చేస్తున్నారని ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెడికల్ కళాశాల నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ.975కోట్లు మాత్రమే వినియోగించారని.. మెడికల్ కళాశాల నిర్మాణానికి జగన్ హయాంలో రాష్ట్రం నుంచి రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. జగన్ కట్టిన మెడికల్ కళాశాలల్లో కేవలం భవనాలు మాత్రమే కట్టి రంగులు వేసి ప్రారంభించారని చెప్పారు. జగన్ హయాంలో నిర్మించిన మెడికల్ కళాశాలల్లో మౌలిక వసతుల కోసం ఇంకా రూ.1900 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని తెలిపారు.


పీజీ కాలేజీల నిర్మాణానికి గతంలో కేంద్రం ఇచ్చిన నిధులను జగన్ మళ్లించారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) ఆరోపించారు. పీపీపీ మోడల్‌లో మెడికల్ కళాశాలలు నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) నిర్ణయించారని చెప్పారు. సామాన్యుడిపై భారం లేకుండా మెడికల్ కళాశాలలు నిర్మిస్తారని, ఇప్పుడున్న ఫీజులతోనే కొత్తగా నిర్మించే మెడికల్ కళాశాలలు నడుస్తాయని తెలిపారు. పీపీపీ విధానంలో సదుపాయాలే పెరుగుతాయని.. ఫీజులు ఎక్కడా పెరగవన్నారు. హైదరాబాద్‌లో జీఎంఆర్ ఎయిర్‌పోర్టునూ గతంలో పీపీపీ విధానంలోనే నిర్మించారని, ఇదే తరహాలో మెడికల్ కళాశాలలు ఉంటాయన్నారు. సామాన్యులపై ఎక్కడా భారం పడకుండా మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

మీరు దీర్ఘాయుష్షుతో ఉండాలి.. ప్రధానికి పవన్ బర్త్‌డే విషెస్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 17 , 2025 | 09:34 PM