Maoist Member : మావోయిస్టు సోడి పొజ్జ అరెస్టు
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:28 AM
మావోయిస్టు పార్టీ కిష్టారం ఏరియా కమిటీ సభ్యుడు సోడి పొజ్జ అలియాస్ లలిత్‌ను అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

వివరాలు వెల్లడించిన అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్
ఎటపాక, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ కిష్టారం ఏరియా కమిటీ సభ్యుడు సోడి పొజ్జ అలియాస్ లలిత్‌ను అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. పొజ్జది ఛత్తీస్‌గఢ్లోని సుక్మా జిల్లా గొండిగూడ గ్రామం. గొత్తికోయ తెగ. 2011లో ఆయన మిలీషియా సభ్యుడిగా చేరాడు. 2014 నుంచి 2019 వరకు మూడు సార్లు భద్రత సిబ్బందితో జరిగిన ఎదురు కాల్పుల్లో పాల్గొన్నారు. 2019లో ఆయనకు బుల్లెట్ గాయమైంది. బుధవారం పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది ఎటపాక మండలం విస్సాపురం పంచాయతీ చెరువుగుంపు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. మందుపాతర పేల్చే ఉద్దేశంతో మావోయిస్టు పార్టీ నాయకులు, మిలీషియా సభ్యులు, సానుభూతిపరులతో కలిసి వెళ్తున్న పొజ్జ పోలీసులకు పట్టుబడ్డాడు. మిగతా వారు తప్పించుకున్నారు. పొజ్జను తనిఖీ చేయగా ఒక గ్రనేడ్, మావోయిస్టులకు చెందిన కరపత్రాలు, రూ.1,000 నగదు దొరికాయి. అరెస్టు అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించినట్టు అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే
Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News