Share News

Andhra Pradesh weather : బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో వర్షాలు

ABN , Publish Date - Sep 22 , 2025 | 06:48 PM

ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని పైన ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఫలితంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Andhra Pradesh weather :  బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో వర్షాలు
Andhra Pradesh weather

విశాఖపట్నం, సెప్టెంబర్ 22 : ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని పైన ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. ఫలితంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనికి తోడు ఈనెల 25న తూర్పు-మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం మీదుగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం కూడా ఉందని పేర్కొంది.


ఇది 27 తేదీన దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా జిల్లాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనాల ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ లోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 22 , 2025 | 06:48 PM