LokSabha: రాజధాని అమరావతికి రుణాలు.. కేంద్రం కీలక ప్రకటన
ABN , Publish Date - Mar 10 , 2025 | 07:19 PM
LokSabha: కూటమి ప్రభుత్వం కొలువు తీరన అనంతరం రాజధాని అమరావతి పనులు చురుకందుకొన్నాయి. రాజధాని అమరావతి నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం రుణాలు తీసుకొంటుంది. అందుకోసం ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంక్ రుణాలు ఇస్తుంది. అలాగే ప్రపంచ బ్యాంక్ సైతం రుణం మంజూరు చేస్తుంది. అలాంటి వేళ.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి కీలక ప్రకటన చేశారు.
న్యూఢిల్లీ, మార్చి 10: రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఆంధ్రప్రదేశ్ ఎఫ్ఆర్‌బీఎం పరిమితిలోకి రావని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. ఈ రుణాలను ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిమితిోకి లెక్కించకూడదని నిర్ణయించినట్లు పార్లమెంట్‌కు ఆయన తెలిపారు. సోమవారం లోకసభలో వైసీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఆ క్రమంలో అందుకు సంబంధించిన అన్ని వివరాలను ఆయన సభలో వివరించారు.
Also Read: కొన్ని గంటల పాటు ప్రయాణం.. గమ్యస్థానానికి చేరకుండానే వెనక్కి తిరిగిన విమానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన అమరావతి నిర్మాణానికి విదేశీ సంస్థల నుంచి తీసుకునే రుణాలు ఏవీ ఆ రాష్ట్ర అప్పుల పరిధిలోకి రావని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అలాగే రాజధాని అమరావతి ప్రాంతంలో అత్యవసర మౌలిక వసతుల కోసం ఇప్పటి వరకు ప్రత్యేక సాయం... గ్రాంట్స్ కింద రూ.2,500 కోట్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి కార్యక్రమం, అమరావతి సమ్మిళిత,సుస్ధిర రాజధాని నగర అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రూ.6,700 కోట్ల చొప్పున రుణ ఆమోదం కోసం సాయం చేశామని ఆయన సోదాహరణగా గణాంకాలతో సహా వివరించారు.
Also Read: ఒక ఆట ఆడుకొంటున్నారు..
ప్రపంచ బ్యాంకు రుణం ఈ ఏడాది జనవరి 22 నుంచి.. అలాగే ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వచ్చాయన్న కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంజక్ చౌదరి లోక్ సభ సాక్షిగా ప్రకటించారు. అయితే ఈ రుణాలకు సంబందించిన పంపిణీ ఇంకా జరగలేదని తెలిపారు. ప్రస్తుత ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 10 శాతానికి మించకుండా..గరిష్టంగా రూ.1,500 కోట్లు, ప్రత్యేక సాయంగా..గ్రాంట్‌గా ఆంధ్రప్రదేశ్‌కు ''కౌంటర్ పార్ట్ ఫండింగ్'' సమకూర్చాలని కూడా నిర్ణయించామని ఆయ తెలిపారు.
Also Read: పండగ వేళ శ్మశానంలో..
ఈ ప్రాజెక్టుకు అందిస్తున్న రుణాన్ని ఆంధ్రప్రదేశ్ రుణ పరిమితిలో లెక్కించ కూడదని నిర్ణయించినట్లు ఆ సమాధానంలో ఆయన క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు. రుణం మంజూరు చేసేటప్పుడు రూపొందించిన మార్గదర్శకాలు, షరతులను అనుసరించి నిధుల వినియోగ పర్యవేక్షణ జరుగుతుందని తన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు.
Also Read: బీజేపీ ఎంపీ రిసెప్షన్ వేడుక.. అతిథులకు కీలక సూచన..
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభత్వానికి ప్రజలు పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో రాజధాని అమరావతి, రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు తీసుకోంటుంది. అలాగే ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి సైతం రుణాలు పొందేందుకు చర్యలు చేపట్టింది. అందుకు సంబంధించిన అన్ని ఒప్పందాలు ఇప్పటికే ఖరారయ్యాయి.
Also Read: శివపార్వతుల ఆశీస్సులు పొందాలంటే ఇలా చేయాలి
మరోవైపు ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు ఇప్పటికే పునరుద్ఘాటించారు. అదీకాక.. గత వైసీపీ పాలనలో రాష్ట్రానికి మూడురాజధానులంటూ ప్రకటన చేసి.. రాష్ట్రాభివృద్ధిని అధ:పాతాళానికి నెట్టేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు సారథ్యంలో వ్యూహాత్మకంగా అడుగు వేస్తోంది.
For AndhraPradesh News And Telugu News