Share News

Air India Plane: కొన్ని గంటల పాటు ప్రయాణం.. గమ్యస్థానానికి చేరకుండానే వెనక్కి తిరిగిన విమానం

ABN , Publish Date - Mar 10 , 2025 | 06:40 PM

Air India Plane: 300 మంది ప్రయాణికులతో విమానం బయలుదేరింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు ప్రయాణించింది. కానీ ఒకే ఒక్క కరణంతో.. సదరు విమానాన్ని సిబ్బంది వెనక్కి తిప్పారు. బయలుదేరిన విమానాశ్రయంలో విమానాన్ని దింపేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Air India Plane: కొన్ని గంటల పాటు ప్రయాణం.. గమ్యస్థానానికి చేరకుండానే వెనక్కి తిరిగిన విమానం

న్యూఢిల్లీ, మార్చి 10: చికాగో నుంచి న్యూఢిల్లీ బయలుదేరిన విమానం కొన్ని గంటల అనంతరం గమ్యస్థానానికి చేరకుండా.. వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. ఈ ఘటన ఇటీవల చికాగోలో చోటు చేసుకుంది. ఇంతకీ ఏమైందంటే.. మార్చి 6వ తేదీన దాదాపు 300 మంది ప్రయాణికులతో చికాగో నుంచి ఎయిర్ ఇండియా విమానం న్యూఢిల్లీ బయలుదేరింది. విమానంలోని మొత్తం 12 వాష్ రూమ్‌ల్లో 11 పరిస్థితి అత్యంత భయానకంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. వాష్ రూమ్‌ల్లోని మరుగుదొడ్డు్ల్లో బాటిల్స్, దుస్తులు, పాలిథిన్ కవర్లు వేయడంతో వాటిని ఉపయోగించ లేని విధంగా తయారయ్యాయి.

Also Read: ఒక ఆట ఆడుకొంటున్నారు..


అయితే విమానం చికాగో నుంచి బయలుదేరి దాదాపు నాలుగున్నర గంటలు దాటింది. ఇక బిజినెస్ క్లాస్‌లోని ఒక్క వాష్ రూమ్‌లోని మరుగుదొడ్డి మాత్రమే ప్రయాణికులు వినియోగించుకునేందుకు వీలుగా ఉంది. అలాంటి వేళ.. ప్రయాణికుల ఇబ్బందులను విమానంలోని సిబ్బంది గమనించారు. ఇదే విషయాన్ని షికాగో ఎయిర్ పోర్ట్ అధికారులకు వివరించారు.

Also Read: పండగ వేళ శ్మశానంలో..


అనంతరం విమానం వెనక్కి తిరిగి చికాగోలోని ఓ హారే అంతర్జాతీయ విమానంలో ల్యాండ్ అయింది. ఆ తర్వాత విమాన ప్రయాణాన్ని రిషెడ్యూల్ చేస్తామని.. లేకుంటే టికెట్ ఛార్జీలను వెనక్కి ఇచ్చేస్తామన్నారు. ప్రయాణికులు ఏదీ ఎంచుకుంటే అది చేస్తామని చెప్పారు. మరోవైపు విమానంలోని వాష్ రూమ్స్‌ను శుభ్రం చేస్తున్నారు. అందుకోసం దాదాపు రెండు రోజుల సమయం పడుతోందని విమానాశ్రయ అధికారులు వివరించారు.

Also Read: బీజేపీ ఎంపీ రిసెప్షన్ వేడుక.. అతిథులకు కీలక సూచన..


ఇక చికాగో నుంచి న్యూఢిల్లీకి దాదాపు 14 గంటల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కానీ దాదాపు నాలుగున్నర గంటల పాటు గాలిలో ముందుకు దూసుకు వెళ్లిన విమానం.. అనంతరం చికాగో ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయ్యేందుకు అంతే వేగంగా వెనక్కి వెళ్లింది.

Also Read: శివపార్వతుల ఆశీస్సులు పొందాలంటే ఇలా చేయాలి

For National News And Telugu news

Updated Date - Mar 10 , 2025 | 06:41 PM