Minister Vasamsetti Subhash: ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు..
ABN , Publish Date - Sep 17 , 2025 | 09:25 PM
వైసీపీ ఓ విషవృక్షమని, విషవృక్షం నుంచి వచ్చిన విత్తనాలనే రాష్ట్రంలో వైసీపీ నేతలు చల్లుతున్నారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను తప్పుడు మార్గంలో తీసుకెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి: వైసీపీ ఓ విషవృక్షమని, విషవృక్షం నుంచి వచ్చిన విత్తనాలనే రాష్ట్రంలో వైసీపీ నేతలు చల్లుతున్నారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను తప్పుడు మార్గంలో తీసుకెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే.. జగన్ హయాంలో కేవలం 5 మాత్రమే పూర్తి చేశారని చెప్పారు. జగన్ నిర్మించిన 5 మెడికల్ కళాశాలలకు రూ.2,563 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. కేవలం కేంద్రం ఇచ్చిన రూ.671కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసా నిధులు కూడా కేటాయించకుండా అన్నీ తమే నిర్మించామని విష ప్రచారం చేస్తున్నారని మంత్రి సుభాష్ ధ్వజమెత్తారు. 50 శాతం మెడికల్ సీట్లు ప్రైవేటుపరం చేసింది జగన్ కాదా అని నిలదీశారు. జగన్ 33 శాతం నిర్మాణం మాత్రమే పూర్తి చేసి కళాశాలు ప్రారంభించడం ఆశ్చర్యకరమైన విషయమని చెప్పారు. మరోవైపు కల్తీ మద్యంతో గత ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీసిందన్నారు. అలాగే యూరియా కొరత వస్తుందని తప్పుడు ప్రచారం చేసి, రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి చూసి ఒర్వలేక అనవసర రాద్దాంతం చేస్తున్నారని చెప్పారు. ప్రజలు గుణపాఠం చెప్పినా వైసీపీ నేతల తీరు మానడం లేదని మంత్రి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
మీరు దీర్ఘాయుష్షుతో ఉండాలి.. ప్రధానికి పవన్ బర్త్‌డే విషెస్
Read Latest AP News And Telugu News