TDP Vs YSRCP Clash: రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. ఏం జరిగిందంటే
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:11 AM
TDP Vs YSRCP Clash: ఏపీలో వైసీపీ మూకలు మరోసారి రెచ్చిపోయారు. టీడీపీ నేత కుమారుడి వివాహ ఊరేగింపులో వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు.
కర్నూలు, జూన్ 3: గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అధినేత నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు కొనసాగించిన హిట్లర్ పాలనను తట్టుకోలేక వారిని గద్దె దించేశారు ప్రజలు. కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే అధికారం కోల్పోయినప్పటికీ వైసీపీ నేతలు (YSRCP Leaders) మాత్రం తమ నైజాన్ని వీడటం లేదు. తాజాగా కర్నూలు జిల్లా (Kurnool District) మంత్రాలయం నియోజకవర్గం కోసిగిలో టీడీపీ నేత కుమారుడి పెళ్లి ఊరేగింపులో వైసీపీ నేతలు దాడి చేశారు. పెళ్లికి వచ్చిన వారిపై, టీడీపీ కార్యకర్తలపై కర్రెలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. చివరికి మహిళలను కూడా వైసీపీ శ్రేణులు విడిచిపెట్టలేదు. దాడి చేసి మెడలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలను లాక్కుపోయారు.
మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. కోసిగిలోని టీడీపీ నాయకుడు పోతుల తాయన్న కుమారుడి పెళ్లి ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీ ఎంపీపీ ఈరన్న ఇంటి ముందర నుంచి ఊరేగింపు వెళ్లాల్సి ఉంది. దీంతో వైసీపీ నేతలు రెచ్చిపోయి ప్రవర్తించారు. తన ఇంటి ముందు నుంచి ఊరేగింపు నిర్వహించరాదంటూ వైసీపీ ఎంపీపీ ఈరన్న, ఆయన అనుచరులు అడ్డుకున్నారు. ఊరేగింపు నిర్వహించేందుకు వీళ్లేదంటూ వైసీపీ ఎంపీపీ రెచ్చిపోయాడు. ఊరేగింపును వైసీపీ అడ్డుకోవడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎలాంటి కార్యక్రమం జరిగినా ఇలానే వెళ్తుంటారని.. ప్రత్యేకంగా తమను అడ్డుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. గత కొన్నేళ్ల నుంచి ఇలానే జరుగుతోందని.. ఇప్పుడు కక్షపూరితంగా చేయడం మంచిది కాదని, తమ ఊరేగింపును అడ్డుకోవద్దని ఈరన్న కుటుంబసభ్యులకు టీడీపీ నేతలు చెప్పారు.
అయితే తమకే ఎదురు చెబుతారా అంటూ టీడీపీ నాయకుడిపైనా, పెళ్లి బృందంపై విచక్షణారహితంగా దాడి చేశారు. వైసీపీ ఎంపీపీ అనచరులు దాదాపు 50 మంది పెళ్లి బృందంపై మూకుమ్మడిగా దాడి చేశారు. వీరిని విడిపించేందుకు పెళ్లి బృందంలోని మహిళలు వెళ్లగా.. ఏమాత్రం కనికరించకుండా మహిళలని చూడకుండా వారిపై దాడి చేశారు. అంతేకాకుండా బంగారం, వెండి ఆభరణాలను తీసుకెళ్లారు. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈరన్న, అతడి కుటుంబసభ్యులు బీభత్సం సృష్టించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వైసీపీ శ్రేణులను చెదరగొట్టారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు వైసీపీకి చెందిన 11 మందిపై కేసు నమోదు చేశారు. గాయపడిన వారు ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ముగ్గురు పరిస్థితి సీరియస్‌గా ఉండగా.. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. ఈ దాడిని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఇవి కూడా చదవండి
నేడు, రేపు తేలికపాటి వర్షాలు..
Read Latest AP News And Telugu News