Srisailam Dasara:చివరి రోజుకు దసరా మహోత్సవాలు
ABN , Publish Date - Oct 02 , 2025 | 09:32 AM
నేటి సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లు నందివాహనంపై ఆశీనులై పూజలందుకోనున్నారు. నందివానంపై ఆది దంపతులకు ఆలయ ఉత్సవం, జమ్మివృక్షం వద్ద శమీపూజలు చేయనున్నారు. రాత్రి శ్రీస్వామి అమ్మవారి తెప్పోత్సవంతో దసరా మహోత్సవాలు ముగియనున్నాయి.
నంద్యాల, అక్టోబర్ 2: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి (Srisailam Temple) దేవాలయంలో దసరా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. విజయదశమి సందర్భంగా భ్రమరాంబికాదేవి నిజరూపాలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేటి సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లు నందివాహనంపై ఆశీనులై పూజలందుకోనున్నారు. నందివానంపై ఆది దంపతులకు ఆలయ ఉత్సవం, జమ్మివృక్షం వద్ద శమీపూజలు చేయనున్నారు. రాత్రి శ్రీస్వామి అమ్మవారి తెప్పోత్సవంతో దసరా మహోత్సవాలు ముగియనున్నాయి.
దసరా శరన్నవాత్రుల సందర్భంగా శ్రీశైలం దేవాలయానికి భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో స్వామివారి గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను రద్దు చేసిన ఆలయ అధికారులు.. అలంకార దర్శనాలకు అనుమతి ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
Tirumala : తిరుమలలో నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Marathon Run: విజయవాడ మారథాన్ రన్‌లో హీరో శర్వానంద్ జోష్
Read latest AP News And Telugu News