Tirumala : తిరుమలలో నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Oct 02 , 2025 | 09:25 AM
తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి కొనసాగుతూ, ఈరోజు ముగింపు దశకు చేరుకున్నాయి. తొమ్మిది రోజులుగా అంగరంగ వైభవోపేతంగా సాగుతున్న ఉత్సవాల్లో లక్షలాది భక్తులు..
తిరుపతి, అక్టోబర్ 2: తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి కొనసాగుతూ, ఈరోజుకి (అక్టోబర్ 2) ముగింపునకు చేరుకున్నాయి. తొమ్మిది రోజులు అంగరంగ వైభవోపేతంగా సాగిన ఉత్సవాల్లో లక్షలాది భక్తులు పాల్గొని, వివిధ వాహన సేవలు, రథోత్సవం వంటి కార్యక్రమాలు భక్తిప్రపత్తులతో తిలకించి పరవశించారు.
ఈరోజు ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య వరాహ స్వామి పుష్కరిణిలో (శ్రీవారి పుష్కరిణి) చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. 1,000 మంది పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో భద్రతను ఏర్పరిచారు.
ఈ రాత్రి 7:30 గంటలకు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ధ్వజావరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. ఆలయ ధ్వజస్తంభంపై ఎగురవేసిన గరుడ ధ్వజాన్ని అవరోహించడంతో ఈ మహోత్సవం ముగుస్తుంది. బ్రహ్మదేవుడు స్వయంగా ప్రారంభించినట్టు పురాణాల్లో పేర్కొన్న ఈ ఉత్సవాలు భక్తులకు పుణ్యఫలాలు, దిగ్విజయాన్ని ఇస్తాయని విశ్వాసం.
ఈ వార్తలు కూడా చదవండి..
నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..
For More AP News And Telugu News