Minister TG Bharat: కర్నూలుకు అతిపెద్ద బేవరేజెస్ ప్లాంట్.. భారీగా ఉద్యోగాలు: మంత్రి టీజీ భరత్
ABN , Publish Date - Nov 11 , 2025 | 03:47 PM
ప్రపంచంలో రెండవ అతిపెద్ద బేవరేజెస్ ప్లాంట్ కర్నూల్ జిల్లా... మెక్సికో తర్వాత రెండో ప్లాంట్ జిల్లాకు వచ్చిందని మంత్రి టీజీ భరత్ అన్నారు. దాదాపు మూడు వేల కోట్లతో కర్నూలులో రిలయన్స్ పెట్టుబడులు పెడుతోందని తెలిపారు.
కర్నూలు, నవంబర్ 11: కర్నూలు జిల్లా బ్రాహ్మణపల్లిలో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. బ్రాహ్మణపల్లిలో మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. ప్రపంచంలో రెండవ అతిపెద్ద బేవరేజెస్ ప్లాంట్ కర్నూల్ జిల్లాకు తీసుకొచ్చామన్నారు. సీఎం చంద్రబాబు బ్రాండ్‌తోనే ఇది సాధ్యమైందని తెలిపారు. మెక్సికో తర్వాత రెండో ప్లాంట్ కర్నూలుకు వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద రెండో ప్రాజెక్ట్ కర్నూలులో నెలకొల్పుతున్నారని తెలిపారు.
మూడు వేల కోట్లతో రిలయన్స్ కర్నూలులో పెట్టుబడులు పెడుతోందని... దాదాపు ఐదు వేల మందికి ఉపాధి లభించనుందని వెల్లడించారు.కూటమి ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ప్లాంట్‌ను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్లాంట్ రావడం వల్ల స్థానిక యువతకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఎయిర్ పోర్ట్‌లో శిక్షణా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
సిగాచి కెమికల్స్ ఓర్వకల్లుకు కెమికల్ ప్లాంట్ వచ్చిందని తెలిపారు. ప్రతి జిల్లాల్లో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ తెలిపారన్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు రూ.23 కోట్లతో మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. సీబీఎన్ బ్రాండ్‌తోనే పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు కొనసాగితే ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందని.. అలాంటి లీడర్ నాయకత్వాన్ని మళ్ళీ గెలిపించుకోవాలని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
త్వరలోనే ఏపీకి మరిన్ని పరిశ్రమలు: మంత్రి పయ్యావుల
అన్ని జిల్లాల సమాన అభివృద్ధికి కృషి: మంత్రి నారాయణ
Read Latest AP News And Telugu News