Lokesh praises Modi: నమో అంటే విక్టరీ... ఏది చేపట్టినా విజయమే: లోకేష్
ABN , Publish Date - Oct 16 , 2025 | 03:23 PM
దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చిన ఘనత మోదీది అంటూ మంత్రి లోకేష్ కొనియాడారు. మోదీ కొట్టిన దెబ్బకు పాక్ దిమ్మ తిరిగిందన్నారు. ట్రాంప్ టారిఫ్స్‌తో పలు దేశాలు వణికినా మోదీ బెదరలేదని అన్నారు.
కర్నూలు, అక్టోబర్ 16: భారత్‌ను తిరుగులేని శక్తిగా ప్రధాని మోదీ (PM Modi) మారుస్తున్నారని మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) అన్నారు. నన్నూరులో 'సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్' బహిరంగసభలో మంత్రి మాట్లాడుతూ.. బ్రిటీష్ వారిని గడగడలాడించిన ఉయ్యాలవాడ పుట్టిన నేల అని.. కర్నూలు ప్రజల రాజసం కొండారెడ్డి బురుజు అని చెప్పుకొచ్చారు. మన నమో అంటే విక్టరీ.. ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే అని అన్నారు. గుజరాత్ సీఎంగా.. దేశ ప్రధానిగా 25 ఏళ్లు పూర్తి చేస్తుకున్నారని తెలిపారు. దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చిన ఘనత మోదీది అంటూ మంత్రి కొనియాడారు. మోదీ కొట్టిన దెబ్బకు పాక్ దిమ్మ తిరిగిందన్నారు. ట్రాంప్ టారిఫ్స్‌తో పలు దేశాలు వణికినా మోదీ బెదరలేదని అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు సూపర్ సేవింగ్ అయ్యిందన్నారు.
పేద ప్రజల చిరునవ్వే మోదీకి పండుగన్నారు. దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చిన ఘనత మోదీదే అని వెల్లడించారు. జీఎస్టీ తగ్గింపుతో రూ.8వేల కోట్ల ఆదాయం కోల్పోతామని చెప్పినా.. పేదలకు మంచి జరుగుతుందని సీఎం అన్నారని తెలిపారు. డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ కేంద్రంలో, రాష్ట్రంలో ఉందన్నారు. పారిశ్రామిక ప్రాజెక్టులు, రైల్వే, హైవే ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయని చెప్పారు. భారత్ 4వ ఆర్ధిక వ్యవస్థగా ఎదగడానికి కారణం ప్రధాని మోదీనే అని అంటూ ప్రధానిపై మంత్రి లోకేష్ ప్రశంసల వర్షం కురిపించారు.
కాగా.. జిల్లాలో ప్రధాన ప్రధాన మంత్రి నరేంద్ర పర్యటన కొనసాగుతోంది. శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం అనంతరం నన్నూరులో 'సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్' బహిరంగసభలో పాల్గొన్నారు ప్రధాని. ఈ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి శివుడి జ్ఞాపికను బహుకరించారు సీఎం. ఆపై మోదీని సీఎం, డిప్యూటీ సీఎం శాలువతో సత్కరించారు. అలాగే ప్రధానికి ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఆంజనేయస్వామి జ్ఞాపిక అందజేశారు. మరి కాసేపట్లో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. రూ.9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే రూ.2,279 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి...
శ్రీశైలం మల్లికార్జున స్వామికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..
రెచ్చిపోయిన సైకో.. తల్లిదండ్రులపైనే
Read Latest AP News And Telugu News