Police Notices to YSRCP Leaders: ఆరె శ్యామలతోపాటు పలువురు వైసీపీ నాయకులకు నోటీసులు
ABN , Publish Date - Nov 01 , 2025 | 05:15 PM
వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామలతో పాటు మరికొందరు వైసీపీ నాయకులకు బిగ్ షాక్ తగిలింది. కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై తప్పుడు ప్రచారం చేసినందుకు..
కర్నూల్: వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామలతో పాటు మరికొందరు వైసీపీ నాయకులకు బిగ్ షాక్ తగిలింది. కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై తప్పుడు ప్రచారం చేసినందుకు పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక పోలీసు బృందం, హైదరాబాద్‌లోని గండిపేటలో ఆరె. శ్యామల నివాసానికి వెళ్లి నోటీసులు అందజేసింది. నోటీసుల ప్రకారం, మూడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని సూచించారు.
కాగా, ఈ నెల 24వ తేదీన కర్నూలు జిల్లా చిన్నటేకూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బైక్‌ను ఢీకొట్టడంతో బస్సులోని 19 మంది సజీవ దహనమయ్యారు. అంతేకాకుండా, మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
అయితే, ఈ ప్రమాదంపై వైసీపీ దుష్ప్రచారం చేసింది. బెల్టు షాపులు, కల్తీ మద్యం కారణంగానే బస్సు ప్రమాదం జరిగిందంటూ వైసీపీ కీలక నేతలు తప్పుడు ప్రచారం చేశారు. ఈ క్రమంలో కర్నూలు మండలం బి. తాండ్రపాడుకు చెందిన పేరపోగు వెనుములయ్య పోలీసులను ఆశ్రయించి వారిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేసి తాజాగా, విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
కాశీబుగ్గకు బయలుదేరిన మంత్రి లోకేష్
కాశీబుగ్గ ఘటనలో బాధ్యులపై చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News