Share News

Kurnool Tragedy: డ్రైవర్‌ లక్ష్మయ్య గురించి వెలుగులోకి సంచలన వాస్తవాలు

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:13 AM

పదవ తరగతి ఫెయిల్ అయినట్టు నకిలీ ధ్రువీకరణ పత్రాలతో లక్ష్మయ్య లైసెన్స్ పొందినట్లు గుర్తించారు. లక్ష్మయ్య స్వగ్రామం పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని ఓపిజర్ల.

Kurnool Tragedy: డ్రైవర్‌ లక్ష్మయ్య గురించి వెలుగులోకి సంచలన వాస్తవాలు
Kurnool Tragedy

కర్నూలు, అక్టోబర్ 25: కర్నూలులో జరిగిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ లక్ష్మయ్య గురించి సంచలన విషయాలు బయటపడ్డాయి. నకిలీ సర్టిఫికెట్‌తో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన లక్ష్మయ్య.. వి.కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద కారకుడిగా నిలిచాడు. పదో తరగతి ఫెయిలైనట్లు నకిలీ పత్రాలు సృష్టించి, లైసెన్స్ పొందినట్లు గుర్తించారు. లక్ష్మయ్య స్వగ్రామం పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని ఓపిజర్ల. ఆర్టీఏ నిబంధనల ప్రకారం హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీసం ఎనిమిదవ తరగతి వరకు చదవాల్సి ఉంటుంది.


లక్ష్మయ్య మాత్రం ఐదవ తరగతి వరకే చదివి.. పదవ తరగతి ఫెయిల్‌ అయినట్లు నకిలీ సర్టిఫికెట్ సమర్పించి లైసెన్స్ పొందాడు. 2004లో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఆ సమయంలో క్లీనర్ మృతి చెందగా.. లక్ష్మయ్య బయటపడ్డాడు. ప్రస్తుతం డ్రైవర్ లక్ష్మయ్య పోలీసుల అదుపులో ఉన్నాడు.


కాగా.. నిన్న కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు జరిగిన ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. బైక్‌ను కావేరి ట్రావెల్స్ బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ ఎగిరి రోడ్డు పక్కన పడిపోగా.. బైక్ బస్సు కిందకు వెళ్లి ఇరుక్కుంది. కానీ బస్సు డ్రైవర్ మాత్రం ఆపకుండా ముందుకు వెళ్లిపోవడంతో ఒక్కసారిగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. కొంత మంది ప్రయాణికులు ముందే గుర్తించి బస్సు అద్దాలు పగులగొట్టి కిందకు దూకి ప్రాణాలు రక్షించుకోగా.. మరికొందరు మాత్రం బస్సులోనే సజీవ దహనం అవడం అందరినీ కలిచివేసింది.


ఇవి కూడా చదవండి..

కర్నూలు అగ్ని ప్రమాదం.. వందల ఫోన్లు పేలడమే ప్రధాన కారణమా!

నాగుల చవితి.. తెల్లవారే పుట్టలో పాలు పోసిన మండలి బుద్ధ ప్రసాద్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 25 , 2025 | 11:51 AM