సొంతింటి కల సాకారంతో సంతోషం
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:13 AM
సొంతింటి కల సాకారం కావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
గోనెగండ్ల, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): సొంతింటి కల సాకారం కావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. గోనెగండ్లలోని 2వ వార్డులో పీఎంఏవై కింద నిర్మించుకున్న ఇంటిని బుధవారం ఆయన ప్రారంభించారు. లబ్ధిదారురాలికి తాళం చెవిని ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంతిళ్లు లేని పేదలకు ఇంటిని నిర్మించి ఇస్తామని ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. ప్రస్తుతం గోనెగండ్లలో 138 గృహాల నిర్మాణాలను పూర్తి చేశారని తెలిపారు. గ్రామాలలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అందులో బాగంగా రూ. 2.50 కోట్లుతో జలజీవన్ మిషన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాసరరెడ్డి, హౌసింగ్ డీఈ ప్రసాద్, ఎంపీడీవో మణిమంజరి, టీడీపీ మండల కన్వీనర్ తిరుపతయ్యనాయుడు, గ్రామ మేజర్ సర్పంచ్ హైమావతి, అడ్వకేట్ చంద్రశేఖర్, మహల్ రహంతుల్లా, సింగిల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి, రామాంజినేయులు, బడేసా, షేక్షావలి, హరికృష్ణ, రాజేష్, రెహంతుల్లా, రఫీక్, రమేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
మంత్రాలయం: బడుగు బలహీన వర్గాల ఆభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి, జనసేన ఇన్‌చార్జి, రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు బి.లక్ష్మన్న అన్నారు. మండలంలోని మాధవరం గ్రామంలో గృహాన్ని డీపీవో భాస్కర్, హౌసింగ్ డీఈ లాల్‌కృష్ణయ్య, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో నూర్జహాన్, డిప్యూటీ ఎంపీడీవో రామాంజినేయులు, గ్రామ కార్యదర్శి వేణుగోపాల్, ఇంజనీరింగ్ అసిస్టేంట్ పవన్‌కుమార్ ఆధ్వర్యంలో ఇంటికి రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చావడి వెంకటేష్, మాజీ జడ్పీటీసీ ఆర్‌జలక్ష్మయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు ఎస్‌ఎం గోపాల్‌రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి బార్కి ఉరుకుందు, కమ్మరి ఉరుకుందు, శివరాం, గోపాల్, చావడి జయరాం, రాఘవేంద్ర, నరసింహులు, నాగరాజు, సురేష్, నర్సారెడ్డి, విష్ణువర్ధన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బసాపురంలో ప్రారంభించిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
మండలంలోని 52 బసాపురంలో ప్రభుత్వం నిర్మించిన బోయభీమక్క ఇంటిని ఎమ్యోల్యే బాలనాగిరెడ్డి రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. వైసీపీ మండల అధ్యక్షులు గుర్రెడ్డి భీమిరెడ్డి, దశరఽథ రెడ్డిలకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పల్కారు. హౌసింగ్ అధికారులు రాజేష్, వీరేంద్ర, సోమప్ప,ఈరన్న, సాహితి ఆధ్వర్యంలో ఇంటికి పూజలు చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో నరసప్ప, నాగరాజు, దేవేంద్ర, డాక్టర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.