Share News

అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలి: సీపీఎం

ABN , Publish Date - Jan 20 , 2025 | 12:26 AM

పార్లమెంట్‌ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను అవమానపరిచిన కేంద్ర మంత్రి అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలని సీపీఎం నాయకులు రణధీర్‌, సుధాకర్‌, స్వాములు డిమాండ్‌ చేశారు.

అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలి: సీపీఎం
ఆత్మకూరులో నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నాయకులు

ఆత్మకూరు, జనవరి 19(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను అవమానపరిచిన కేంద్ర మంత్రి అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలని సీపీఎం నాయకులు రణధీర్‌, సుధాకర్‌, స్వాములు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట గో బ్యాక్‌ అమిత్‌షా అంటూ నిరసన వ్యక్తం చేశశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో రాజ్యాంగానికి సంబంధించిన చర్చ జరిగే సమయంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. ఈ విషయంపై ప్రధాని మోదీ స్పందించకపోవడం సరికాదన్నారు. తక్షణమే కేంద్ర మంత్రి అమిత్‌షాను బర్తరఫ్‌ చేసి ఆయన పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు సంపత్‌కుమార్‌, సురేంద్ర, రామ్‌నాయక్‌, శివకుమార్‌, కిరణ్‌, మల్లయ్య, గణపతి, రమణ, రవి తదితరులు ఉన్నారు.

కొత్తపల్లి(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించిన అమిత్‌షాను పార్లమెంటు బర్తరఫ్‌ చేయాలని సీపీఎం కొత్తపల్లి మండల కార్యదర్శి ఎస్‌.స్వాములు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకులు పాతకోట భాస్కర్‌, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు బొల్లు ప్రసాద్‌బాబు యాదవ్‌, దళిత నాయకులు గూడెం బాలనాగన్న డిమాండ్‌ చేశారు. అమిత్‌షా విజయవాడ రాకను నిరసిస్తూ ఆదివారం కొత్తపల్లి మండలంలో గాంధీ విగ్రహం ముందు అమిత్‌షా గో బ్యాక్‌ అంటూ నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ అంబేడ్కర్‌ పేరును చెప్పడానికి కూడా సహించలేని స్థితిలో బీజేపీ ప్రభుత్వం ఉందని ఘాటుగా విమర్శించారు. పాతకోట వెంకటరమణ, అంకన్న, ప్రభుదాస్‌, మోక్షేశ్వరుడు, శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Jan 20 , 2025 | 12:26 AM