Share News

Kurnool Road Accident: కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

ABN , Publish Date - Nov 18 , 2025 | 09:24 PM

కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు దాటుతున్న పాదచారులను లారీ వేగంగా ఢీ కొట్టింది.

Kurnool Road Accident: కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
Kurnool accident

కర్నూలు : జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కల్లూరు గ్రామంలో జాతీయ రహదారి(National highway accident)పై కేశవ గ్రాండ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కేశవ గ్రాండ్ వద్ద రోడ్డు దాటుతున్న పాదచారులను లారీ వేగంగా ఢీ(Lorry hits pedestrians) కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు వెల్దుర్తి మండలం రత్నపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణ (65), కల్లూరు మండలం గోకులపాడుకు గ్రామానికి చెందిన శ్రీనివాసులు (50) , కల్లూరు గ్రామానికి చెందిన వెంకట రామిరెడ్డి (40)గా గుర్తించారు.


శ్రీనివాసులుకు చెందిన లారీ రిపేర్ కావడంతో పక్కకు ఆపి నలుగురూ రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవలే కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన 19 మంది సజీవ దహనం అయ్యారు. అలానే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మరుకముందే తాజాగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.



ఈ వార్తలు కూడా చదవండి..

అంతా డీజీపీ పర్యవేక్షణలోనే..మావోల అరెస్ట్‌పై కృష్ణా ఎస్పీ

వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ నిర్ణయం ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2025 | 10:03 PM