Share News

NRI Ravi Potluri: బన్నీ ఉత్సవాల్లో తొక్కిసలాట.. బాధిత కుటుంబానికి అండగా రవి పొట్లూరి

ABN , Publish Date - Nov 18 , 2025 | 09:12 PM

బన్నీ ఉత్సవాల్లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన కర్నూలు వాసి చిన్న ఆంజనేయ కుటుంబాన్ని తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు రవి పొట్లూరి, ఇతర ఎన్నారైలు ఆదుకున్నారు. రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు.

NRI Ravi Potluri: బన్నీ ఉత్సవాల్లో తొక్కిసలాట.. బాధిత కుటుంబానికి అండగా రవి పొట్లూరి
Ravi Potluri Charity

ఇంటర్నెట్ డెస్క్: కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల తొక్కిసలాటలో మృతి చెందిన ఆదోని వాసి చిన్న ఆంజనేయ కుటుంబానికి తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు పొట్లూరి రవి లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించారు. సినీహీరో నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని అయిన చిన్న ఆంజనేయ తన ఎడమ చేతికి NBK అని పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు. దేవరగట్టు బన్నీ ఉత్సవాలలో భాగంగా మాలమల్లేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన చిన్న ఆంజనేయ.. తొక్కిసలాటలో మృతి చెందారు.


కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మృతుడి భార్య ఈరమ్మ, ఆమె కుమారుడు రామాంజీకి ఎన్నారైలు పొట్లూరి రవి, వెంకట్ సుంకర, వేణు కోడే, సుబ్రహ్మణ్యం ఒసూరు తదితరులు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సుధాకర్ నాయుడు, సందడి మధు, మీనాక్షి, మనోహర్ చౌదరి, బాబు, మార్కండి, నాగరాజ్, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

2.jpg


ఈ వార్తలు కూడా చదవండి

తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబురాలు

పాకిస్థానీలకు 59 రోజుల్లో కెనడా వీసా దరఖాస్తు ప్రాసెసింగ్.. భారతీయులకు మాత్రం..

Read Latest and NRI News

Updated Date - Nov 18 , 2025 | 09:21 PM