Share News

YS Sharmila: మోదీ గారు.. ఈసారైనా అమరావతి కట్టేనా.. లేక మళ్ళీ మట్టేనా..

ABN , Publish Date - May 01 , 2025 | 01:15 PM

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్రానికి పదేళ్లుగా చేసిన మోసంపై ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. విభజన హామీల్లో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత అని, ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తానని రాసి ప్రధాని మోదీ సంతకం చేయాలన్నారు.

YS Sharmila: మోదీ గారు.. ఈసారైనా అమరావతి కట్టేనా.. లేక మళ్ళీ మట్టేనా..
YS Sharmila comments

విజయవాడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు (AP Visit) వస్తున్న నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు (APCC Chief) వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila Reddy) కీలక వ్యాఖ్యలు (Key Comments)చేశారు. ఈ సందర్భంగా గురువారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్ర మోదీగారు.. ఈసారైనా అమరావతి కట్టేనా .. లేక మళ్ళీ మట్టేనా ..’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల క్రితం మట్టి తెచ్చి మన నోట్లో కొట్టారని, మన ఆశల మీద నీళ్ళు చల్లి వెళ్ళారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇప్పుడు రాజధాని పునఃశంకుస్థాపనకు వస్తున్న మోదీకి ఇదే అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామన్నారు. ఈ మట్టిని చూసిన ప్రతిసారి 2015లో తొలి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలు గుర్తు రావాలని అన్నారు.


మోదీ ఆత్మ విమర్శ చేసుకోవాలి..

పదేళ్లుగా చేసిన మోసంపై ప్రధాని మోదీ ఆత్మ విమర్శ చేసుకోవాలని వైఎస్ షర్మిల రెడ్డీ అన్నారు. మోదీ ఈ మట్టి సాక్షిగా ప్రమాణం చేసి అమరావతిలో అడుగు పెట్టాలని అన్నారు. మరోసారి ఇలాంటి మోసం చేయనని ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. విభజన హామీల్లో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత అని, ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తానని రాసి సంతకం చేయాలన్నారు. ‘మాకు అప్పులు వద్దు. మా భావితరాల మీద ఆ భారం వద్దు’. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం బేషరతుగా రూ.1.50 లక్షల కోట్లను 3 ఏళ్లలో కేంద్రం ఇవ్వాలని షర్మిల కోరారు. అలాగే ఇస్తామని ప్రధాని ప్రకటన చేయాలన్నారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలని, అలాగే 10 ఏళ్లుగా అమలుకు నోచుకోని విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని షర్మిల అన్నారు.

Also Read: తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాల కొత్త షెడ్యూల్ అమలు..


అమరావతి పునఃప్రారంభ పనులకు మోదీ శంకుస్థాపన..

కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 2న ఆయన ఆంధ్రప్రదేశ్‌లలో పర్యటించనున్నారు. అమరావతిలో 58,000 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఏపీ బహుళ రోడ్డు , రైలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి.. అక్కడ నిర్వహించే బహరింగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.


ప్రధాని సభకు 5 లక్షల మంది..

కాగా ప్రధాని సభకు దాదాపు 5 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాజధానికి తరలివచ్చే ప్రజల కోసం రవాణా వసతి కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాజధానికి వచ్చే ప్రజల కోసం 8 వేల బస్సులు ఏర్పాటు చేసింది. రాజధాని చుట్టుపక్కల ఉన్న 8 జిల్లాల నుంచి భారీగా జనం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. ఈ 8 జిల్లాలకు మొత్తం 6,600 బస్సులు కేటాయించింది. మిగిలిన జిల్లాల్లోని 120 నియోజకవర్గాలకు 1400 బస్సులు ఏర్పాటు చేసింది. గురువారం రాత్రికి సంబంధిత గ్రామాలకు బస్సులు చేరుకోనున్నాయి. ఒక్కో బస్సుకు ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఇన్ ఛార్జిగా ప్రభుత్వం నియమించింది. సభకు జనాలను తీసుకెళ్లి తిరిగి ఇంటికి చేర్చే బాధ్యత ఇన్ ఛార్జులకు అప్పగించింది. ఏర్పాట్ల పర్యవేక్షణకు మండలానికి ఒక అధికారికి ఇన్ ఛార్జి బాధ్యతలు అప్పగించింది. బస్సులు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సభకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించింది. రాజధానికి వెళ్లే ప్రజలకు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సదుపాయం కల్పించింది. వేసవి దృష్ట్యా సభకు వచ్చే ప్రజలకు మజ్జిగ, ఓఆర్ఎస్, పండ్లు పంపిణీకి ఏర్పాట్లు చేసింది. జిల్లాల పౌరసరఫరాల శాఖాధికారులకు ఆహారం సరఫరా బాధ్యత ప్రభుత్వం అప్పగించింది. సభకు వచ్చే మార్గాల్లో ఆరోగ్య కేంద్రాలు, సభా గ్యాలరీల్లోనూ ఆరుగురు సిబ్బందితో కూడిన వైద్య బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

భారీగా తగ్గిన బంగారం ధరలు..

మార్కో రుబియో ఫోన్ కాల్‌పై ఎస్ జయశంకర్ ఎమన్నారంటే..

కార్మిక లోకానికి కేసీఆర్ మేడే శుభాకాంక్షలు

For More AP News and Telugu News

Updated Date - May 01 , 2025 | 01:44 PM