Police Arrest Thief: తాళం వేసిన గృహాలే టార్గెట్.. కానీ చివరకు
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:44 PM
Police Arrest Thief: తాళం వేసిన గృహాలలో దొంగతనానికి పాల్పడిన పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్‌ను గుణదల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా దాదాపు 11 దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు.

విజయవాడ, జులై 3: తాళం వేసిన ఇళ్లే అతడి టార్గెట్. ఎక్కడ తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే చాలు ఆ ఇంట్లోకి చొరబడి ఉన్నదంతా ఊడ్చేస్తాడు. ఇలా ఎన్నో ఇళ్లలో దొంగతనాలు చేసి దర్జాగా బతికాడు. దొంగతనం చేస్తూ పోలీసులకు (AP Police) దొరక్కుండా తప్పించుకుని తిరిగాడు. చివరకు అతడి పాపం పండి పోలీసులకు చిక్కాడు. ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. విజయవాడ కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన గృహాలలో దొంగతనానికి పాల్పడిన పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్‌ను గుణదల పోలీసులు (Gunadala Police) అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా దాదాపు 11 దొంగతనాల కేసులను పోలీసులు చేధించారు.
తాళం వేసిన గృహాలను టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలకు పాల్పడటంలో ఉయ్యాల రాజేష్ సిద్దహస్తుడని పోలీసులు తెలిపారు. ఓ దొంగతనం కేసులో వేలిముద్రల ఆధారంగా అతడిని గుణదల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ దామోదర్ (ACP Damodar) మాట్లాడుతూ.. తాళం వేసిన గృహాలే ప్రధాన టార్గెట్‌గా పాత నేరస్థుడు ఉయ్యాల రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుడిని అదుపులో తీసుకొని 11 కేసులను చేధించినట్లు చెప్పారు. నిందితుడి వద్ద నుంచి ఆరు లక్షల రూపాయలు విలువ చేసే 60 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు పాత నేరస్తుడు కావడంతో సంఘటనా స్థలాల్లోనే వేలిముద్రలను సేకరించి టెక్నాలజీ ద్వారా పట్టుకున్నామని ఏసీపీ దామోదర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
ఆ రెండు జిల్లాల్లో ఉగ్రలింకులకు వారి ఉదాసీనతే కారణం: హోంమంత్రి
జడ్జిపై ట్రోల్స్.. బెంచ్‌పైనే జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
Read latest AP News And Telugu News