Share News

AP Fake Liquor Scam: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. నలుగురు నిందితులు కస్టడీకి..

ABN , Publish Date - Dec 08 , 2025 | 09:59 PM

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా నలుగురు నిందితులకు కస్టడీకి పంపిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

AP Fake Liquor Scam: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. నలుగురు నిందితులు కస్టడీకి..
AP Fake Liquor Scam

అమరావతి, డిసెంబర్ 08: నకిలీ మద్యం కేసు(Fake Liquor Scam)లో నలుగురు నిందితులను కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు(Vijayawada Court) ఆదేశాలు జారీ చేసింది. అబ్కారీ అధికారులు(Excise Officers) నిందితులను పదిరోజులు తమ కస్టడీకి పంపాలని కోర్టును అభ్యర్థించగా.. న్యాయస్థానం అంగీకరించింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితులు.. కట్టా రాజు, సయ్యజ్ హజీ, అంథాదాస్, మిథున్ దాస్‌లను ఈ నెల 11 నుంచి 15 వరకు కస్టడీలోకి తీసుకోనున్నారు ఎక్సైజ్ అధికారులు. నకిలీ మద్యం తయారీ, పంపిణీకి సంబంధించి లోతైన సమాచారాన్ని రాబట్టే దిశగా అధికారులు దర్యాప్తు చేపట్టనున్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ నకిలీ మద్యం కేసులో.. అన్నమయ్య జిల్లా(Annamaiah District) సహా పలు ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు బయటపడటంతో ప్రభుత్వం దీనిపై విచారణకు సిట్(SIT)ను ఏర్పాటుచేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులు అరెస్ట్ అయ్యారు. వారిలో జోగి రమేశ్(Jogi Ramesh), జోగి రాము(Jori Ramu) సోదరులూ ఉన్నారు. తాజాగా.. మరో నలుగురు నిందితుల కస్టడీ ద్వారా ఈ కేసుపై మరింత లోతైన విచారణ జరిగి కీలక అంశాలు బయటపడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.


ఇవీ చదవండి:

మేము మీలా కాదు.. దేశం కోసమే ఉన్నాం: ప్రియాంక గాంధీ

అఖండ-2ను వీక్షించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. ఏమన్నారంటే.?

Updated Date - Dec 08 , 2025 | 09:59 PM