AP News: ఆంధ్రప్రదేశ్‌కు అమిత్ షా.. పర్యటన వివరాలు ఇవే..
ABN , Publish Date - Jan 18 , 2025 | 07:40 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) రెండ్రోజులపాటు పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి శనివారం రాత్రి 08:30 గంటలకు అమిత్ షా చేరుకోనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు(Gannavaram Airport)లో అమిత్ షాకు కూటమి నేతలు ఘనస్వాగతం పలకనున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) రెండ్రోజులపాటు పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి శనివారం రాత్రి 08:30 గంటలకు అమిత్ షా చేరుకోనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport)లో అమిత్ షాకు కూటమి నేతలు ఘనస్వాగతం పలకనున్నారు. కేంద్ర హోంమంత్రికి స్వాగతం పలికేందుకు మూడు పార్టీల నుంచి 13 మంది నేతలు విమానాశ్రయానికి చేరుకున్నారు. టీడీపీ(TDP) నుంచి మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత, ప్రభుత్వ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, గద్దె రామ్మోహన్, తదితర నేతలు అమిత్ షాకు వెల్కమ్ చెప్పనున్నారు. స్వాగతం పలికేందుకు కూటమి నేతలు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఉండవల్లి వరకూ అమిత్ షాకు స్వాగతం పలుకుతూ పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు.
Kadapa: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్.. చంద్రబాబుకు విజ్ఞప్తి..
గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి అమిత్ షా రానున్నారు. అయితే విజయవాడలో ఆయనకు ఎంపీ కేశినేని చిన్ని, ఎన్డీయే నేతలు, కార్యకర్తలు స్వాగతం పలకనున్నారు. అనంతరం చంద్రబాబు నివాసానికి చేరుకుని డిన్నర్ చేస్తారు. ఈ విందు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పలువురు సీనియర్ నేతలు పాల్గొనున్నారు. విందు భేటీ ముగిసిన తర్వాత తిరిగి రాత్రి 10:30 గంటలకు విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
Palnadu: రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. చిన్నపిల్లలే లక్ష్యం.. సినిమా లెవల్ స్టోరీ..
ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఏపీ బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముచ్చటిస్తారు. అనంతరం ఉదయం 11:30 గంటలకు కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరుకు చేరుకుంటారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సౌత్ క్యాంపస్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా కూటమి నేతలు పాల్గొంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కి రూ.11,400 కోట్లు ప్రకటించిన మరుసటి రోజే అమరావతికి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Amaravati: జనసేన కార్యాలయంపై డ్రోన్ హల్‌చల్.. టార్గెట్ పవనేనా..
Tiruvuru: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై టీడీపీ అధిష్ఠానం ఫైర్.. విషయం ఇదే..