Share News

Amaravati: జనసేన కార్యాలయంపై డ్రోన్ హల్‌చల్.. టార్గెట్ పవనేనా..

ABN , Publish Date - Jan 18 , 2025 | 06:12 PM

అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తుతెలియని డ్రోన్ ఎగరడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇవాళ (శనివారం) మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 గంటల వరకూ దాదాపు 20 నిమిషాలపాటు డ్రోన్ ఎగిరినట్లు జనసేన నేతలు గుర్తించారు.

Amaravati: జనసేన కార్యాలయంపై డ్రోన్ హల్‌చల్.. టార్గెట్ పవనేనా..
Deputy CM Pawan Kalyan

అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి(Mangalagiri)లోని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) క్యాంపు కార్యాలయంపై గుర్తుతెలియని డ్రోన్ (Drone) ఎగరడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇవాళ (శనివారం) మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 గంటల వరకూ దాదాపు 20 నిమిషాలపాటు డ్రోన్ ఎగిరినట్లు జనసేన నేతలు గుర్తించారు. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి పార్టీ నేతలు తెలియజేశారు. దీంతో భద్రతాపరమైన కారణాల దృష్ట్యా డీజీపీ కార్యాలయానికి డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు. అలాగే గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సైతం విషయాన్ని తెలియజేశారు.

Tiruvuru: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై టీడీపీ అధిష్ఠానం ఫైర్.. విషయం ఇదే..


కాగా, నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం భవనంపై డ్రోన్ ఎగరడం పలు అనుమానాలను తావిస్తోంది. ఇటీవల అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా పర్యటనకు పవన్ కల్యాణ్ వెళ్లగా అక్కడ నకిలీ ఐపీఎస్ హడావుడి చేశారు. అనంతరం అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు విజయవాడలో ఇటీవల ప్రారంభమైన బుక్ ఫెస్టివల్‌లో స్టాల్స్‌ను పవన్ పరిశీలిస్తుండగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. తాజాగా జనసేన కార్యాలయంపై గుర్తుతెలియని డ్రోన్ ఎగిరింది. ఇలాంటి వరస ఘటనలతో జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నేతపై ఎవరైనా కుట్రలు పన్నుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Palnadu: రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. చిన్నపిల్లలే లక్ష్యం.. సినిమా లెవల్ స్టోరీ..

Kadapa: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్.. చంద్రబాబుకు విజ్ఞప్తి..

Updated Date - Jan 18 , 2025 | 09:09 PM