Swachh Andhra Awards: సీఎం చంద్రబాబు చేతుల మీదుగా స్వచ్ఛతా అవార్డులు..
ABN , Publish Date - Oct 05 , 2025 | 09:38 PM
21 కేటగిరీల్లో రాష్ట్రస్థాయిలో 69 అవార్డులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదానం చేయనున్నారు. జిల్లా స్థాయిలో 1,257 అవార్డులు విజేతలకు అందించనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేపు(సోమవారం) స్వచ్ఛతా అవార్డులు ప్రదానం చేయనున్నారు. స్వచ్ఛాంధ్రలో ఉత్తమ పనితీరు కనపరిచిన సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వ శాఖలకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేస్తారు. 21 కేటగిరిల్లో మున్సిపాలిటీలు, పంచాయితీలు, పారిశుద్ధ్య కార్మికులకు అవార్డులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లా స్థాయిలో 1,257 అవార్డులు విజేతలకు సీఎం చంద్రబాబు అవార్డులు అందించనున్నారు. ఇప్పటికే అవార్డులకు రాష్ట్ర స్థాయిలో 6 మున్సిపాలిటీలు, 6 గ్రామ పంచాయతీలు ఎంపికైనట్లు సమాచారం. స్వచ్ఛత కార్యక్రమాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన మున్సిపాలిటీలకు కేంద్రం ఇస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల తరహాలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను కూటమి ప్రభుత్వం ఇస్తోంది. దీనిలో భాగంగా అద్భుత ప్రతిభ కనబరిచిన పారిశుధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్‌లు, స్వయం సహాయక సంఘాలకు చంద్రబాబు అవార్డులు ప్రదానం చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు