Mahashivaratri: మల్లన్న బ్రహ్మోత్సవాలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:16 PM
Mahashivaratri: శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎం చంద్రబాబుకు ఆలయ అధికారులు ఆహ్వానం అందించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఈనెల 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు మహోత్సవాలు జరుగుతున్నాయని సీఎంకు తెలిపారు.

అమరావతి, ఫిబ్రవరి 17: శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో (Srisailam Temple) ఈనెల 19 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (mallanna brahmotsavams) మొదలుకానున్నాయి. బ్రహ్మోత్సవాల కోసం దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్ల పూర్తి చేశారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం అందించారు దేవాలయ అధికారులు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు, పండితులు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆహ్వానించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఈనెల 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు మహోత్సవాలు జరుగుతున్నాయని సీఎంకు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎంకు ఆలయ పండితులు స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందించి ఆశీర్వదించారు.
మంత్రికి ఆహ్వాన పత్రిక
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని శ్రీశైలం దేవస్థానం ఈవో ఎం. శ్రీనివాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు, పురోహితులు ఆహ్వానించారు. ఈరోజు (సోమవారం) సచివాలయంలో మంత్రిని శ్రీశైలం ఆలయ ఈవో మర్యాదపూర్వంగా కలిసి.. బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ పురోహితులు, వేద పండితులు.. వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా మహా శివరాత్రిని పురస్కరించుకుని జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈవోను అడిగి తెలుసుకున్నారు మంత్రి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం తీసుకోవాల్సిన భద్రతా చర్యలు.. క్యూలైన్లలో రద్దీ నివారణ వంటి అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై ఆలయ ఈవోకు మంత్రి జనార్థన్ రెడ్డి పలు సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి...
Crime News.. విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత..
మహిళలకు గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు
Read Latest AP News And Telugu News