Share News

CM Chandrababu: సెర్ప్‌కు 25 ఏళ్లు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

ABN , Publish Date - Jun 16 , 2025 | 04:48 PM

CM Chandrababu: సెర్ప్‌ను తీసుకొచ్చి నేటికి 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. లక్షలాది గ్రామీణ మహిళల జీవితాలలో, వేలాది గ్రామాలలో నిరంతరం అభివృద్ధి వెలుగులు నింపుతూ గ్రామీణ పేదరిక నిర్మూలనకు సెర్ప్ నిరంతరం కృషి చేస్తోందన్నారు.

CM Chandrababu: సెర్ప్‌కు 25 ఏళ్లు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
CM Chandrababu

అమరావతి, జూన్ 16: గ్రామాల ఆర్థిక అభివృద్ధి కోసం, గ్రామాల్లో పేదరిక నిర్మూలన కోసం తీసుకొచ్చిన గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)ను మహిళలు ఓ ఉద్యమంలా తీసుకెళ్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కొనియాడారు. తొలుత వెలుగు అనే ఓ కార్యక్రమాన్ని చేపట్టగా.. అది కాలక్రమేనా సెర్ప్‌గా రూపాంతరం చెందిందన్నారు. సెర్ప్‌ను తీసుకొచ్చి నేటికి 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా గ్రామీణ మహిళలకు, సెర్ప్ ఉద్యోగులకు సీఎం అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ముఖ్యమంత్రి పోస్ట్ చేశారు.


చంద్రబాబు ట్వీట్ ఇదే..

‘సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఉట్నూరు అనే ఒక మారుమూల ప్రాంతంలో వెలుగు అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాను. గ్రామీణ ప్రాంత మహిళల భాగస్వామ్యంతో గ్రామాల ఆర్థికాభివృద్ధిని సాధించడమే ఆనాటి ప్రాజెక్టు లక్ష్యం. అది కాలక్రమంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP)గా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి లక్షలాది గ్రామీణ మహిళల జీవితాలలో, వేలాది గ్రామాలలో నిరంతరం అభివృద్ధి వెలుగులు నింపుతూ గ్రామీణ పేదరిక నిర్మూలనకు సెర్ప్ నిరంతరం కృషి చేస్తోంది. సెర్ప్ కార్యకలాపాలలో భాగస్వాములవుతూ... నవసమాజ నిర్మాతలై గ్రామీణ పేదరిక నిర్మూలనను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్న గ్రామీణ మహిళలకు... వారిని ప్రగతి పథంలో నడిపిస్తున్న సెర్ప్ ఉద్యోగులకు ఈ సందర్భంగా అభినందనలు’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.


ఇవి కూడా చదవండి

దారుణం.. ఆస్తి కోసం కన్నకూతురినే

కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 16 , 2025 | 04:59 PM