Shocking Kidnap Case: దారుణం.. ఆస్తి కోసం కన్నకూతురినే
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:26 PM
Shocking Kidnap Case: అనంతపురంలో యువతి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉన్న తిరుపతమ్మ అనే యువతిని సొంత కుటుంబసభ్యులే కిడ్నాప్ చేశారు.

అనంతపురం, జూన్ 16: జిల్లాలోని కంబదూరు మండలం కురాకులపల్లిలో కిడ్నాప్ (Kidnap) కలకలం రేపింది. కన్న తల్లిదండ్రులే కూతురిని (Teacher Kidnapped By Family) కిడ్నాప్ చేశారు. ఎస్డీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న యువతి ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో తల్లిదండ్రులు ఆమెపై కక్ష పెంచుకున్నారు. భర్తతో కలిసి యువతి బైక్‌పై వెళ్తుండగా కిడ్నాప్ చేశారు. పథకం ప్రకారం 11 మందితో కలిసి యువతిని కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్‌ను పోలీసులు చేధించారు.
ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉన్న తిరుపతమ్మ అనే యువతిని సొంత కుటుంబసభ్యులే కిడ్నాప్ చేశారు. ఆస్తి కోసం కిడ్నాప్ చేయడంతో పాటు కుటుంబసభ్యుల ఆమోదం లేకుండా మరొకరిని వివాహం చేసుకుందనే ఆగ్రహంతో తిరుపతమ్మను కిడ్నాప్ చేసి బెంగళూరుకు తరలించారు. బెంగళూరులోని బంధువుల ఇంట్లో ఉంచారు. తిరుపతమ్మ పేరు మీద ఉన్న ఆస్తులను కుటుంబసభ్యులపై ట్రాన్స్‌ఫర్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఆస్తులను రాసియ్యకపోతే చంపుతామంటూ కూడా తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. దీంతో మీరు చెప్పినట్టుగానే ఆస్తులను ట్రాన్సఫర్ చేస్తానని, కళ్యాణదుర్గం వెళ్లాక తన పేరుతో ఉన్న ఆస్తులతో పాటు ఇతరత్రా ఆస్తులను కూడా ట్రాన్స్‌ఫర్ చేస్తానంటూ కుటుంబసభ్యులకు చెప్పింది యువతి. అందులో భాగంగా బెంగళూరు నుంచి కళ్యాణదుర్గంకు తిరుపతమ్మను కుటుంబసభ్యులు తీసుకువచ్చారు.
అయితే అప్పటికే తిరుపతమ్మ కిడ్నాప్ కేసు నమోదు అవడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. ఓ వాహనంలో యువతితో పాటు కుటుంబసభ్యులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్‌పై పోలీసులు లోతుగా విచారించడంతో కిడ్నాప్ వెనక ఉన్న తతంగం మొత్తాన్ని కూడా వెలికి తీశారు. తిరుపతమ్మ తల్లిదండ్రులతో పాటు కుటుంబసభ్యులే ఆస్తి కోసం ఆమెను కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
పోలీసులు ఏమన్నారంటే
‘యువతికి 32 సంవత్సరాలు వచ్చినప్పటికీ తల్లిదండ్రులు పెళ్లి చేయలేదు. కూతురికి పెళ్లి చేస్తే జీవనాధారం పోతుందని భావించిన వారు పెళ్లి చేయకుండా ఇంటి వద్దే ఉంచుకున్నారు. పెళ్లి చేయమని స్వయంగా అమ్మాయి అడిగితే వాళ్ల చెల్లెలి భర్తను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో తల్లిదండ్రుల ప్రవర్తనతో విసిగిపోయిన సదరు యువతి తనను 20 ఏళ్లుగా ప్రేమిస్తున్న చిన్ననాటి మిత్రుడు తిప్పేస్వామిని పెళ్లి చేసుకుంది. కుమార్తె వివాహ విషయం తెలుకున్న తల్లిదండ్రులు ఆమెపై కక్షతో కిడ్నాప్ చేయాలని ప్రణాళిక చేశారు. అనుకున్న ప్రకారం పక్కా పథకంతో కూతురును కిడ్నాప్ చేసి బంధించారు. కూతురిని హింసించి ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డును లాక్కున్నారు. ఆస్తి రాసివ్వాలని బెదిరించారు’ అని పోలీసులు తెలిపారు. యువతిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించామని.. వారి వద్ద నుంచి కత్తి, బైక్‌ను సీజ్ చేసినట్లు కాప్స్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
షార్‌లో తీవ్రవాదులు ఉన్నారంటూ ఫోన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest AP News And Telugu News