Share News

CM Chandrababu: రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై సర్కార్ ఫోకస్

ABN , Publish Date - Nov 25 , 2025 | 02:01 PM

రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉద్యానవన పంటల ద్వారా రాయలసీమ రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళిక అమలుపై మంత్రులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు.

CM Chandrababu: రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై సర్కార్ ఫోకస్
CM Chandrababu

అమరావతి, నవంబర్ 25: రాయలసీమలో హార్టికల్చర్ పంటల సాగుకు సబ్సిడీలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్‌తో చేయూతను ఇచ్చే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) ఈరోజు (మంగళవారం) సమీక్ష నిర్వహించారు. ఉద్యానవన పంటల ద్వారా రాయలసీమ రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళిక అమలుపై మంత్రులు, అధికారులతో సీఎం సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమలో ఉద్యాన పంటల అభివృద్ధిపై సమావేశంలో చర్చించారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.


5.98 లక్షల మంది ఉద్యాన రైతులకు మరింత లబ్ధి కలిగేలా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. డ్పిప్, సాగునీరు, రవాణా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంచాయతీ రాజ్ రోడ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, గోడౌన్లు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించం ద్వారా హార్టికల్చర్ రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టింది. మారుతున్న ఆహారపు అలవాట్లు, డిమాండ్ ఉన్న పంటల సాగు, టెక్నాలజీ వాడకం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని హార్టికల్చర్ పంటలకు ప్రోత్సాహం కల్పించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

ఉగాదిలోగా 5 లక్షల ఇళ్లు పూర్తి: మంత్రి పార్థసారథి

ఏపీలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవే

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 25 , 2025 | 02:03 PM