Raj Kasireddy: సిట్ విచారించిన 300 మందిలో ఏ ఒక్కరూ నాకు తెలియదు
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:06 PM
కస్టోడియల్ విచారణ అని సిట్ తనన్ను అరెస్టు చేసిందని రాజ్ కసిరెడ్డి వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్ కేసులో తన పాత్ర ఎక్కడా లేదని వివరించారు.
విజయవాడ: ఏసీబీ కోర్టులో లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త రాజ్ కసిరెడ్డి తనపై నమోదైన కేసును ఖండిస్తూ వివరణ ఇచ్చారు. కస్టోడియల్ విచారణ అని సిట్ తనన్ను అరెస్టు చేసిందన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో తన పాత్ర ఎక్కడా లేదని, తన తప్పు లేకపోవడంతో తప్పు చేసినట్లుగా ఆధారాలు సృష్టించారని రాజ్ కసిరెడ్డి ఆరోపించారు. తనపై ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేదని, గతంలో కూడా ఏ కేసులోనూ తాను అరెస్టు కాలేదని స్పష్టం చేశారు.
రూ.11 కోట్లు నావే అయితే నా వేలిముద్రలు ఉంటాయి కదా? రూ.11 కోట్లు క్యాష్ ఒకే వ్యక్తి దగ్గర ఉంటాయా? అని ప్రశ్నించారు. సిట్ అధికారులు సినిమా స్టోరీల కంటే ఎక్కువ కథలు చెబుతున్నారన్నారు. సిట్ విచారించిన 300 మందిలో ఏ ఒక్కరూ కూడా తనకు తెలియదని చెప్పారు. ఎవరో ఒక ఐదుగురిని విచారణ చేసి నేను తెలుసా అని మీరే అడగండని కోరారు. ఈ కేసులో చాలా మంది పేర్లు తాను తొలిసారిగా వింటున్నట్లు తెలిపారు.
Also Read:
భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్
ప్రపంచానికి అనుగుణంగా మారండి.. బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు
ఈ వినాయక చవితికి గణపతిని పూజించడానికి ఉత్తమ సమయం ఇదే!