Share News

Amaravati capital construction: మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు.. ముహూర్తం ఎప్పుడంటే

ABN , Publish Date - Mar 14 , 2025 | 03:01 PM

Amaravati capital construction: అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభానికి ఏపీ ప్రభుత్వం తేదీని ఖరారు చేయనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనుల శంకుస్థాపన జరగాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే.

Amaravati capital construction: మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు.. ముహూర్తం ఎప్పుడంటే
Amaravati capital construction

అమరావతి, మార్చి 14: రాజధాని అమరావతి (AP Capital Amaravati) పనులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేతుల మీదుగా ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మార్చి మూడవ వారంలో ప్రధాని శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లిన సమయంలో ప్రధానిని శంకుస్థాపనకు ఆహ్వానించారని సమాచారం. వచ్చే నెల మూడవ వారం వరకు ప్రధాని షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఆ తరువాత షెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా రాజధాని పనులకు ప్రధాని శంకుస్థాన చేసిన విషయం తెలిసిందే.


ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం రావడంతో రాజధాని పనులు ఆగిపోయాయి. ఆ తరువాత టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు కోరిన వెంటనే రాజధాని పనులకు ప్రపంచ బ్యాంక్ రుణం మంజూరు చేసింది. దీంతో పనులకు శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే సీఆర్డీఏ టెండర్లను ఖరారు చేస్తోంది. అయితే ప్రధాని పర్యటన ఖరారుకు సంబంధించి ధృవీకరణ లేదని అధికారులు చెబుతున్నారు.


కాగా.. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో దాదాపు రూ.40వేల కోట్లు విలువైన పనులకు ఆమోదముద్ర పడింది. కాంట్రాక్టు ఏజెన్సీలకు అంగీకార పత్రాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ పూర్తయ్యాక రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు కలిసి దాదాపు రూ.13వేల 400 కోట్ల రుణాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అలాగే హడ్కో నుంచి మరో రూ.11వేల కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించి అనుమతి లేఖ కూడా రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రం నుంచి అంగీకారం తెలుపుతూ ముంబైలోని హడ్కో కార్యాలయానికి లేఖ పంపారు. అలాగే జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరో రూ.5వేల కోట్లు రుణాలు తీసుకోవడంతో పాటు రూ.1500 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్‌గా తీసుకోనున్నారు. మొత్తం రూ.31వేల కోట్ల నిధులు ప్రభుత్వం వద్ద అమరావతి నిర్మాణానికి సంబంధించి సిద్ధంగా ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..

Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 14 , 2025 | 03:43 PM