Perni Nani YCP Protest Case: పోలీస్‌స్టేషన్‌లో పేర్ని నాని హంగామా.. ఏకంగా పోలీసులనే
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:21 PM
పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వొద్దని వైసీపీ గ్రూపులో నగర అధ్యక్షులు మేకల సుబ్బన్న మెసేజ్ చేశారు. ఈ క్రమంలో కేసు విచారణలో భాగంగా సుబ్బన్నను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు పోలీసులు.
కృష్ణా జిల్లా, అక్టోబర్ 10: మాజీ మంత్రి పేర్నినాని (Former Minister Perni Nani) రెచ్చిపోయారు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో సీఐతో వాగ్వివాదానికి దిగారు మాజీ మంత్రి. ఇటీవల పేర్ని నాని నాయకత్వంలో మెడికల్ కాలేజ్ వద్ద వైసీపీ శ్రేణులు నిరసనకు దిగారు. అయితే అనుమతులు లేని నిరసనలో పాల్గొన్నారని పేర్ని నానితో సహా 400 మందికి 41ఏ నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వొద్దని వైసీపీ గ్రూపులో నగర అధ్యక్షులు మేకల సుబ్బన్న మెసేజ్ చేశారు. ఈ క్రమంలో కేసు విచారణలో భాగంగా సుబ్బన్నను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు పోలీసులు.
విషయం తెలుసుకున్న పేర్నినాని.. కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని హంగామా చేశారు. ఆర్ పేట సీఐతో మాజీ మంత్రి వాగ్వివాదానికి దిగారు. ఒకానొక సందర్భంలో పోలీసులతో అత్యంత దురుసుగా ప్రవర్తించారు. మచిలీపట్నం పోలీసులపై మాజీమంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చట్టాలను పక్కన పెట్టి అధికార పార్టీ నేతలకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది పోలీస్ అధికారుల తీరు పట్ల కానిస్టేబుళ్లు నలిగిపోతున్నారని అన్నారు. వైసీపీ పట్టణ అధ్యక్షులు మేకల సుబ్బన్న అక్రమ అరెస్ట్‌ను పేర్నినాని ఖండించారు. అక్రమ అరెస్ట్‌పై పోలీసులను నిలదీశారు మాజీమంత్రి.
వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 41ఎ నోటీసులు ఇచ్చే క్రమంలో వైసీపీ కార్యకర్తలను భయపెడుతున్నారని ఆరోపించారు. పోలీసుల తప్పుడు కేసులను కోర్టుల్లో ఎదుర్కొంటామని పేర్నినాని స్పష్టం చేశారు. స్టేషన్‌లో పేర్ని నాని చర్యలతో విస్తుపోయిన పోలీసులు... అతడిని స్టేషన్ నుండి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. స్టేషన్‌లో పేర్ని నాని ప్రవర్తనతో విస్తుపోయిన పోలీసులు... అతడిని స్టేషన్ నుండి వెళ్లిపోవాల్సిందిగా కోరారు.
ఇవి కూడా చదవండి...
రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏం తేల్చిందంటే...
పిల్లలపై ఒత్తిడి పెరుగుతోంది.. తల్లిదండ్రులు ఆలోచించాలి
Read Latest AP News And Telugu News