Share News

NTR Health Services Bandh: NTR వైద్య సేవలు బంద్.. స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్

ABN , Publish Date - Oct 09 , 2025 | 01:27 PM

రేపటి నుంచి NTR వైద్య సేవ ట్రస్టు కింద వైద్యం అందించే అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది. అయితే, ఈ విషయంపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు.

NTR Health Services Bandh: NTR వైద్య సేవలు బంద్.. స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
NTR Health Services Bandh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ASHA) సంచలన నిర్ణయం తీసుకుంది . రేపటి నుంచి NTR వైద్య సేవ ట్రస్టు కింద వైద్యం అందించే అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేయనున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది.


అసోసియేషన్ ప్రకటన ప్రకారం, తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల గత్యంతరం లేక ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. పలుమార్లు ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందని, మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో బకాయిలు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. నిర్వహణ ఖర్చులు పెరిగిపోయినా, ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆసుపత్రులు నష్టపోతున్నాయని పేర్కొంది. ఇక రేపటి నుంచి అన్ని రకాల వైద్య సేవలు నిలిపివేయక తప్పదని స్పష్టం చేసింది.


ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ప్రజలు ఇబ్బందులు పడుతారని, ఆసుపత్రులు సేవలు ఆపవద్దని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం రూ. 2,500 కోట్ల బకాయిలు ఉంచిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా చెల్లింపులు చేస్తున్నామని అన్నారు. ఆసుపత్రులు ఎదుర్కొంటున్న కష్టాలు ప్రభుత్వానికి తెలుసన్న మంత్రి, ఈ అంశంపై ఈరోజే సీఎం చంద్రబాబును కలిసి చర్చిస్తామన్నారు.


Also Read:

డిప్యూటీ సీఎం ఉదయనిధి సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారంటే..

హోటల్‌లో ఊహించని సంఘటన.. వెయిట్రెస్ సకాలంలో స్పందించటంతో..

For More Latest News

Updated Date - Oct 09 , 2025 | 01:37 PM