Share News

NTR Bharosa Pension Scheme: శరవేగంగా పెన్షన్ల పంపిణీ..

ABN , Publish Date - Oct 01 , 2025 | 12:35 PM

63.50 లక్షల మందికి గాను ఇప్పటి వరకు 54.32 లక్షల మంది లబ్ధదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ల సొమ్మును అందజేస్తున్నారు.

NTR Bharosa Pension Scheme: శరవేగంగా పెన్షన్ల పంపిణీ..
NTR Bharosa Pension Scheme

అమరావతి, అక్టోబర్ 1: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల (NTR Bharosa Pension Scheme) పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 85 శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తి అయ్యింది. అత్యధికంగా అనంతపురం, విజయనగరం జిల్లాలో 90 శాతంపైగా పెన్షన్లను అందజేశారు. 63.50 లక్షల మందికి గాను ఇప్పటి వరకు 54.32 లక్షల మంది లబ్ధదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ల సొమ్మును అందజేస్తున్నారు. మరికాసేపట్లో విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో పింఛన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపిణీ చేయనున్నారు.


అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నారు సీఎం. ఉదయం నుంచి సాయంత్రం వరకు దత్తి గ్రామంలో పలు ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించనున్నారు.


చిలకలూరిపేటలో పెన్షన్ల పంపిణీ

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పలు వార్డులలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జగన్ రెడ్డి అప్పులు అప్పగించి వెళ్ళిపోయారని విమర్శించారు. చంద్రబాబు తన క్రెడిబుల్టీతో రాష్టాన్ని నడుపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 45 వేల కోట్ల పెన్షన్ల పంపిణీ చేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కువ మొత్తంలో పెన్షన్ పంపిణీ జరుగుతున్న రాష్ట్రం ఏపీనే అని చెప్పుకొచ్చారు. జీఎస్టీ తగ్గించడం వలన ప్రతి కుటుంబానికి 15000 రూపాయలు ఆదా అవుతుందన్నారు. ట్రూ అప్ చార్జీలు రూ.923 కోట్లు ప్రభుత్వం తగ్గించిందన్నారు. పేద, రైతు, మధ్యతరగతి వారికి భారం పడకూడదని సంకల్పం తోటి చంద్రబాబు పనిచేస్తున్నారని చెప్పారు. దేశంలో ఎన్నికలకు పోయేవారికి ఈ సూపర్ సిక్స్ పథకాలు రోల్ మోడల్ కానుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.


అర్హులకు పెన్షన్ వచ్చేలా చేస్తాం: ఎంపీ

విశాఖ జిల్లా వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఉత్తర నియోజక వర్గంలో పెన్షన్లను విశాఖ ఎంపీ శ్రీ భరత్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ.. జీవీఎంసీ పరిధిలో 44వ వార్డులో పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. కొంతమంది తమకు అర్హత ఉన్నా, పెన్షన్లు రావడం లేదని చెబుతున్నారన్నారు. వారి సమస్యలను పరిష్కరించి.. అర్హులందరికీ పెన్షన్లు వచ్చేలా కృషి చేస్తామని ఎంపీ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

కాస్త నిలకడగా కృష్ణానది.. అయినప్పటికీ

ఏపీలో సుస్థిర పట్టణాభివృద్ధికి సిటీ నెట్ సహకారం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 01 , 2025 | 01:17 PM