Liquor Scam Accused Dileep Petition: లిక్కర్ స్కాం.. పైలా దిలీప్ షాకింగ్ పిటిషన్
ABN , Publish Date - Aug 29 , 2025 | 05:06 PM
మా అమ్మను పోలీసులు బెదిరిస్తున్నారంటూ లిక్కర్ స్కాం కేసు నిందితుడు ఏ30 పైలా దిలీప్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కాం కేసు డబ్బులతో నిర్మించినట్లు ఒప్పుకోవాలని..
విజయవాడ: లిక్కర్ స్కాం కేసులో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ30 నిందితుడిగా ఉన్న పైలా దిలీప్, ఏసీబీ కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశాడు. పైలా దిలీప్ తన పిటిషన్‌లో సంచలన ఆరోపణలు చేశారు.
ఒప్పుకోవాలంటూ..
తన తల్లిని పోలీసులు బెదిరిస్తున్నారని పేర్కొన్నాడు. తాము నివాసంగా ఉండే ఇంటి నిర్మాణానికి లిక్కర్ స్కాం డబ్బు ఉపయోగించామని ఒప్పుకోవాలంటూ పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించాడు. తనపై దుష్ప్రచారం చేస్తూ కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారన్న ఆరోపణలు చేశాడు.
కౌంటర్ దాఖలు చేయాలని
ఈ పిటిషన్‌పై స్పందించిన ఏసీబీ కోర్టు, సంబంధిత పోలీసులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేసులో వాదనలు విన్న అనంతరం, తదుపరి విచారణను సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌ను కలకలం రేపుతున్న లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలువురు అధికారులు, రాజకీయ నేతలు, వ్యాపారులు విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో పెద్ద మొత్తంలో స్కాం జరిగినట్లు బయటపడిన నేపథ్యంలో విచారణ మరింత వేగవంతమవుతోంది.
ఆస్తులను అటాచ్ చేయాలని..
ఇదిలా ఉంటే, లిక్కర్ స్కాంలో ఇప్పటికే విచారణ చేపట్టిన సిట్, నిందితుల ఆస్తులను అటాచ్ చేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై అభ్యంతరాలుంటే తెలియజేయాలంటూ మొత్తం 11 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసులు అందుకున్న వారిలో డిస్టిలరీ డైరెక్టర్లు, బ్యాంకులు, లిక్కర్ కేసులో ప్రధాన నిందితులు, ఇతర సంబంధిత వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరికి నోటీసులు జారీ చేశారంటే..
రాజ్ కేసిరెడ్డి
బూనేటి చాణక్య
కాశీచయనుల శ్రీనివాస్
పైలా దిలీప్
వరుణ్ పురుషోత్తం
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
నల్లనన్ మతప్పన్ ( ఎంపీ డిస్టిలరీ)
నల్లనన్ మతప్పన్ ( SNJ సుగర్స్)
SBI, చెన్నై
ICICI , హైదరాబాద్
ట్రెజరీ ఆఫీసర్ విజయవాడ
ఈ రోజు విచారణ సందర్భంగా, SNJ సుగర్స్, MP డిస్టిలరీస్, నిందితుడు వరుణ్ పురుషోత్తం కోర్టుకు హాజరయ్యారు. నోటీసులు అందుకున్న వారిలో పలువురు తమకు ఆస్తుల అటాచ్మెంట్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని కోర్టుకు తెలియజేశారు.
Also Read:
టీడీపీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర.. వీడియో బహిర్గతం
పర్యాటకులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
For More Andhrapradesh News