Share News

Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో నిందితులకు దక్కని ఊరట

ABN , Publish Date - Oct 24 , 2025 | 02:44 PM

మద్యం కుంభకోణం కేసులో నిందితులు రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, భూనేటి చాణిక్య, చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు.. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో నిందితులకు దక్కని ఊరట
Liquor Scam

విజయవాడ, అక్టోబర్ 24: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam Case) నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఏడుగురు నిందితుల బెయిల్ పిటిషన్‌లను ఏసీబీ న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం నిందితులు రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, భూనేటి చాణిక్య, చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు.. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండగా.. బాలాజీ కుమార్ యాదవ్ , నవీన్‌లు గుంటూరు సబ్ జైలులో ఉన్నారు.


ఏడుగురు నిందితులు కూడా తమకు బెయిల్ మంజూరు చేయాలని ఏసీబీ కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై కోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి ఇరు వర్గాల న్యాయవాదులు ఇటీవల కోర్టులో వాదనలు వినిపించారు. వాదనల అనంతరం అందరి బెయిల్ పిటిషన్‌లు డిస్మిస్ చేస్తూ ఏబీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి...

సీఐఐ సదస్సుకు రండి.. పారిశ్రామికవేత్తలకు లోకేష్ ఆహ్వానం

బాలయ్య పేరు ఎత్తే అర్హత నీకుందా?.. జగన్‌పై నుడా చైర్మన్ ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2025 | 04:58 PM