Kollu Ravindra Fires on Perni Nani: వ్యాపారాలు లేని పేర్ని నానికి ఇన్ని వేల కోట్లు ఎలా?
ABN , Publish Date - Oct 21 , 2025 | 07:52 PM
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నీ నాని పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైరయ్యారు. 'పేర్ని నానీ.. రెడ్ లైన్ దాటేశావ్... ఇక వదిలిపెట్టం. నాడు ఆర్యవైశ్యులను వేధించి..
మచిలీపట్నం (కృష్ణాజిల్లా) అక్టోబర్ 21: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నీ నాని పై మంత్రి కొల్లు రవీంద్ర ఫైరయ్యారు. 'పేర్ని నానీ.. రెడ్ లైన్ దాటేశావ్... ఇక వదిలిపెట్టం. బందరు అభివృద్ధి చూసి ఓర్వలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నావు. నాడు ఆర్యవైశ్యులను వేధించి.. నేడు ఆర్యవైశ్యుల రాగం అందుకోవడం సిగ్గుచేటు'. అని రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడిన మంత్రి.. వైసీపీ నేత పేర్ని నాని మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దశాబ్దాలుగా వ్యాపారం చేసుకునే మా కుటుంబంపై నిందలేస్తే ఊరుకునేది లేదు.. బందరు ప్రజలకు అన్యాయం చేయాలని చూసినా, అభివృద్ధి అడ్డుకున్నా తగిన బుద్ది చెబుతాం అంటూ మంత్రి రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. 'పేర్ని నాని రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ప్రజల్ని, వ్యాపారుల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. కొనకళ్ల బుల్లయ్య, తాను కలిసి భూములు కొట్టేశామని చెప్పడానికి పేర్నినాని సిగ్గుపడాలి. నానీ.. దమ్ముంటే రా... రాజకీయంగా బందర్ కు నువ్వేం చేశావో. నేనేం చేశానో తేల్చుకుందాం. పిచ్చి పిచ్చిగా వాగి ప్రజల మధ్య విభేధాలు సృష్టించాలనుకుంటే బుద్ది చెబుతాం.' అని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
ఎలాంటి వ్యాపారాలు లేవని చెప్పుకునే పేర్ని నానికి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి..? అంటూ కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. ముడా భూముల్ని అక్రమంగా తవ్వేసి లక్షల ట్రిప్పుల మట్టి తరలించడం వాస్తవం కాదా..? వీటన్నింటి పై దమ్ముంటే చర్చకు రా.. లేదంటే సైలెంట్ గా ఉండు. అంటూ కొల్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
విభేదాల వేళ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన కిరణ్ మజుందార్
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి