Share News

Jogi Ramesh Liquor Case: కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌కు బిగుస్తున్న ఉచ్చు

ABN , Publish Date - Oct 30 , 2025 | 06:56 PM

ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానంటూ సిట్ అధికారుల విచారణలో జనార్ధన్ రావు సంచలన విషయాలు వెల్లడించారు.

Jogi Ramesh Liquor Case:  కల్తీ మద్యం కేసులో జోగి రమేష్‌కు బిగుస్తున్న ఉచ్చు
Jogi Ramesh Liquor Case

విజయవాడ: ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానని సిట్ అధికారుల విచారణలో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు సంచలన విషయాలు వెల్లడించారు. జోగి రమేష్ ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడని, అయితే ఆ తర్వాత విడిచిపెట్టారని జనార్ధన్ రావు అధికారులకు తెలిపారు. జోగి రమేష్ సూచనల మేరకే విషయం లీక్ చేసి రైడ్ జరిగేలా చేశానని వివరించారు.


అయితే, జోగి రమేష్ మాత్రం తనకు జనార్ధన రావు అనే వ్యక్తి తెలియదని, నకిలీ మద్యం కేసుతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. జనార్ధన రావును తానెప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. అయితే జనార్ధనరావుతో జోగి రమేష్ ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు వాస్తవాలు సిట్ అధికారులకు వెల్లడించడంతో జోగి రమేష్‌కు ఉచ్చు బిగుస్తోంది. జనార్ధన్ రావు స్టేట్‌మెంట్‌ను ఆడియో, వీడియో రికార్డింగ్‌ తోపాటు లిఖిత పూర్వకంగా ఎక్సైజ్, సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డైవర్షన్ కోసమే వైసీపీ కుట్ర: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

టెక్నాలజీ సాయంతో తుపాన్ నష్టాన్ని తగ్గించాం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 30 , 2025 | 07:18 PM